మ్యారేజ్ గిఫ్ట్ కింద దీవినే ఇచ్చేసిన సెలబ్రిటీ

Tue Aug 04 2015 14:36:14 GMT+0530 (IST)

సెలబ్రిటీల మనసు వెన్న మాదిరిగా ఉంటాయి. వారి మనసు దోచుకోవాలే కానీ.. భారీగా స్పందిస్తుంటారు. తాజాగా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్టో.. తన ఏజెంట్ కు ఇచ్చిన మ్యారేజ్ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పెళ్లికి బహుమతి ఇవ్వటం అంటే.. ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు కానీ.. రోనాల్డో స్థాయిలో కాదని అనుకుంటున్నారు. తనకు ఏజెంట్ గా వ్యవహరించి.. ఎన్నో విలువైన కాంటాక్ట్ లను ఇప్పించిన జార్జ్ మెండిస్ కు కలకాలం గుర్తుండి పోయేలా మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చాడు రొనాల్డో.

తాజా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తన అధీనంలో ఉన్న పలు దీవుల్ని గ్రీస్ సర్కారు అమ్మకానికి పెట్టింది. అందులో భాగంగా ఒక దీవిని రొనాల్డో తన ఏజెంట్ కు కొనేశారు.

తన కెరీర్ లో అద్భుతమైన కాంటాక్టులు ఇప్పించి.. వందల కోట్ల రూపాయిలు ఆర్జించేలా సాయం చేసిన మెండిస్ కు వినూత్నంగా బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేసి రొనాల్డో.. అందుకు తగ్గట్లే గ్రీస్ లోని ఒక దీవిని కొనేసి.. బహుమతిగా ఇచ్చేయనున్నాడు. మ్యారేజ్ గిఫ్ట్ లలో రొనాల్డో ఇచ్చిన గిఫ్ట్ వేరయా అనాల్సిందేమో.