Begin typing your search above and press return to search.

రిషబ్ పంత్ పై గిల్ క్రిస్ట్ సీరియస్ వ్యాఖ్యలు!

శుక్రవారం లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 9:53 AM GMT
రిషబ్  పంత్  పై గిల్  క్రిస్ట్  సీరియస్  వ్యాఖ్యలు!
X

శుక్రవారం లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ను ఓడించింది. కుల్‌ దీప్‌ యాదవ్‌ (3/20) స్పిన్‌ వలలో చిక్కుకున్న లక్నో బ్యాటర్లు విలవిల్లాడారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ వ్యవహారశైలిపై ఆడమ్ గిల్ క్రిస్ట్ స్పందించారు. ఇందులో భాగంగా పంత్ వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు.

అవును... లక్నోతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యవహారంపై ఆసీస్‌ మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్‌ ఆడమ్ గిల్‌ క్రిస్ట్‌ అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సరైంది కాదని అన్నారు. ఈ విషయంలో ప్లేయర్ ఎవరైనా జరిమానా విధించాలని సూచించారు. ఇదే సమయంలో ఆ మ్యాచ్ లో పంత్ వ్యవహారశైలిపై పలువురు సీనియర్లు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌ లో దేవదుత్‌ పడిక్కల్ బంతిని ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో బంతి లెగ్‌ సైడ్‌ వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌ గా ప్రకటించారు. ఈ సమయంలో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వెంటనే రివ్యూ కోసం అడిగినట్లు కనిపించింది. ఇదే సమయంలో.. రివ్యూలో సైతం అది వైడ్‌ గానే నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత పంత్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది!

రివ్యూలో కూడా వైడ్ అని కన్ ఫాం అయిన తర్వతా... తాను రివ్యూ అడగలేదంటూ అంపైర్‌ తో రిషభ్ పంత్ చర్చించాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆడమ్ గిల్‌ క్రిస్ట్‌ స్పందిస్తూ.. పంత్‌ చర్యలపై అసహనం వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా.. ఫీల్డ్‌ అంపైర్లకు మ్యాచ్‌ పై మరింత నియంత్రణ అవసరమని.. ఏ ఫార్మాట్‌ లోనైనా ఇంకాస్త సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలంటే అంపైర్లకు అధికారం ఉండాలని అన్నారు.

రిషభ్ పంత్ రివ్యూ అడిగాడా? లేదా? అనేది ఇక్కడ వివాదంగా మారిందని.. వారి మధ్య సమాచార లోపం జరిగిందని.. పైగా ఈ విషయం కోసం నాలుగు నిమిషాల పాటు చర్చించాల్సిన అవసరం లేదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు! పంత్‌ అయినా, వేరొక ప్లేయర్‌ ఫిర్యాదు చేసినా అంపైర్‌ మాత్రం ముగిసిన వ్యవహారంపై స్పష్టమైన సమాధానం ఇచ్చేలా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో... అయినప్పటికీ ఆటగాడు మాట్లాడుతూ ఉంటే జరిమానా విధించాలని గిల్‌ క్రిస్ట్‌ వ్యాఖ్యానించాడు.