Begin typing your search above and press return to search.

ఆ మంత్రి రిజైన్‌ కు రెడీ!..రీజ‌న్ తెలిస్తే షాకే!

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:21 PM GMT
ఆ మంత్రి రిజైన్‌ కు రెడీ!..రీజ‌న్ తెలిస్తే షాకే!
X
రాజ‌కీయ నాయ‌కులు ఏం మాట్లాడినా - ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసినా సంచ‌ల‌నంగానే ఉంటుంది. విష‌యంతో ప‌నిలేకుండా కొన్ని కొన్ని వ్యాఖ్య‌లు మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఆశ్చ‌ర్య‌క‌రమైన ప్ర‌క‌ట‌న‌తో అంద‌రినీ అవాక్క‌య్యేలా చేశారు తెలంగాణ‌కు చెందిన కీల‌క మంత్రి - సీఎం కేసీఆర్‌ కు రైట్ హ్యాండ్‌ గా భావిస్తున్న నేత‌. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా అధికారంలో ఉన్న ఏ ఒక్క‌రూ ఏదైనా ప్ర‌మాదం జ‌రిగినా..ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగినా బాధ్య‌త వ‌హించ‌డం అనేది లేదు! ఈ విష‌యంలో అన్ని పార్టీలూ స‌మాన‌మే. ఇటీవ‌ల ఏపీలో కృష్టాన‌దిలో ప‌డ‌వ మునిగి 22 మంది ప్రాణాలు కోల్పోయినా - రెండ‌ళ్ల కింద‌ట గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యంలో 30 మంది చ‌నిపోయినా.. చంద్ర‌బాబు జ‌మానాలో ఏ ఒక్క‌రూ బాధ్య‌త వ‌హించ‌లేదు. ప‌డవ ప్ర‌మాదాన్ని ప్రైవేటుపైకి నెట్టేశారు.

ఇక‌, గోదావ‌రి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌ను ఏక స‌భ్య క‌మిష‌న్ విచార‌ణ‌కు వ‌దిలిపెట్టి చేతులు దులుపుకొన్నారు. వారి వారి ప‌ద‌వులు కాపాడుకున్నారు. ఒక ప‌క్క వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప‌డ‌వ ప్ర‌మాదానికి కార‌కులు ఎవ‌రు? ఎవ‌రు? ప‌్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలి! సీఎం బాబు రాజీనామా చేయాలి. టూరిజం మంత్రి అఖిల ప్రియ రిజైన్ చేయాలి! అని పెద్ద పెట్టున డిమాండ్ చేసినా.. ఏ ఒక్క‌రూ స్పందించ‌లేదు. మ‌రి ఇంత‌లా నాయ‌కులు అధికారం కోసం - ప‌ద‌వుల కోసం పాకులుడూ.. `బాధ్య‌త‌` అనే మాట‌ను అట‌కెక్కించేశారు. అయితే - అంద‌రు నాయ‌కులు - నేత‌లు ఒకేలా ఉంటే ఇప్పుడు ఈ క‌థ‌నం మ‌నం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు! తెలంగాణ‌కు చెందిన రోడ్లు భ‌వ‌నాల మంత్రి - గ‌తంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ నుంచి వ‌చ్చిన సీనియ‌ర్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో రోడ్లు నిలువెత్తు గుంత‌ల‌తో నిండిపోయాయి. చుక్క వ‌ర్షానికే రోడ్లు వ‌ర‌ద‌లను త‌ల‌పిస్తున్నాయి. త్వ‌ర‌లోనే వీటిని జాతీయ ర‌హ‌దారుల స్థాయిలో డెవ‌ల‌ప్ చేస్తామ‌ని మంత్రి తుమ్మ‌ల‌ వెల్ల‌డించారు. తెలంగాణలో ఆరు వేల కిలోమీటర్ల రోడ్లు అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నామని అన్నారు. రోడ్లు పదేళ్లు గ్యారెంటీగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నేషనల్ హైవే రోడ్ స్థాయిలో కింది నుంచి రోడ్‌ తవ్విస్తామని మూడేళ్లలో గ్రామీణ - మండల - జిల్లా కేంద్రాల కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న రోడ్డు గుంతలు పడితే రాజీనామాకు సిద్ధమని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్ రోడ్లను శాశ్వతంగా నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. డ్రైనేజీ - వాటర్ పైప్ లైన్లు నిర్మించాకే రోడ్లు వేస్తామన్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. రోడ్ల విష‌యంలో ఇంత బాధ్య‌త‌గా కేవ‌లం చిన్న గుంత‌కే తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని తుమ్మ‌ల ప్ర‌క‌టించ‌డం ప్ర‌స్తుత రోజుల్లో సంచ‌ల‌నం కాక‌మ‌రేమిటి?! చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!!