Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ టీ స‌ర్కారు హ‌క్కు అని వాదించారు

By:  Tupaki Desk   |   30 July 2015 11:33 AM GMT
ట్యాపింగ్ టీ స‌ర్కారు హ‌క్కు అని వాదించారు
X
ఏపీకి చెందిన ముఖ్య నేత‌ల ఫోన్ల ట్యాపింగ్ విష‌యంలో మ‌రో ముసుగు తొలిగిపోయింది. తాము ఎవ‌రి ఫోన్లు ట్యాప్ చేయ‌లేద‌ని.. త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని గ‌తంలో చెప్పిన టీఆర్ ఎస్ నేత‌ల మాట‌ల్లో ప‌స లేద‌ని తేలిపోయింది.
మొన్నామ‌ధ్య‌.. సుప్రీంకోర్టులో కాల్ డేటా ఇవ్వాల్సిన ప‌రిస్థితుల్లో.. టెలికం ఆప‌రేట‌ర్లు తాము ఫోన్ల‌ను ట్యాప్ చేశామ‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వ సూచ‌న‌తో తామీ ప‌ని చేశామ‌ని చెప్ప‌టం తెలిసిందే. అయితే.. అప్ప‌టికి తెలంగాణ స‌ర్కారు ఎలాంటి మాట రాలేదు.

కానీ.. తాజాగా విజ‌వాడ కోర్టుకు కాల్‌డేటా ఇవ్వాల‌ని కోరిన నేప‌థ్యంలో.. ఆ అవ‌స‌రం లేదంటూ హైకోర్టుకు వెళ్లిన తెలంగాణ స‌ర్కారు.. తాజాగా ట్యాపింగ్ విష‌యంలో స‌రికొత్త వాద‌న‌ను వినిపించింది.

తెలంగాణ స‌ర్కారు త‌ర‌ఫున వాదించిన ప్ర‌ముఖ న్యాయ‌వాది రాంజెఠ్మాలానీ.. ఫోన్ల‌ను ట్యాప్ చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌ని వాదించారు. ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌ప‌రిచే క్ర‌మంలో ఫోన్ ట్యాపింగ్ చేసే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఉంద‌ని ఆయ‌న కుండ బ‌ద్ధ‌లు కొట్టారు.అంతేకాదు.. విజ‌య‌వాడ కోర్టుకు కాల్ డేటా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ప్ర‌భుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు పెట్ట‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగే సంద‌ర్భంలో ఫోన్ ట్యాప్ చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌న్న జెఠ్మాలానీ వాద‌న‌తో.. ట్యాపింగ్ విష‌యాల్ని ఓపెన్ గా చెప్పేశార‌నే చెప్పాలి.