Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టులో 3నిమిషాల్లో మూవీ డౌన్ లోడ్

By:  Tupaki Desk   |   5 Feb 2016 10:30 PM GMT
ఎయిర్ పోర్టులో 3నిమిషాల్లో మూవీ డౌన్ లోడ్
X
ఒక సినిమా డౌన్ లోడ్ చేయాలంటే ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి... కనీసం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. కానీ, హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తే మీ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా మూడు నిమిషాల్లో ఒక సినిమాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నిజమే... ప్రస్తుతం డొమెస్టిక్ టెర్నినల్ వద్ద ఉన్న ఈ సౌకర్యం త్వరలో విమానాశ్రయంలో ఎక్కడి నుంచైనా పొందేలా విస్తరించబోతున్నారు. అంతేకాదు... గురువారం ప్రారంభమైన ఈ సర్వీసు రెండు వారాల పాటు పూర్తిగా ఫ్రీ. అంటే ఈ రెండు వారాల్లో అక్కడ ఏ సినిమానైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నమాట. ఆ తరువాత మాత్రం ఛార్జి చేస్తారు. అప్పుడు సినిమాను బట్టి రూ.50 నుంచి రూ.100 వరకు ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్రాప్ కార్న్ సంస్థ ఈ వీడియో ఆన్ డిమాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వైఫై హాట్ స్పాట్ సహాయంతో వినియోగదారులకు ఇంటర్నెట్ లేకపోయినా కూడా సినిమాలు డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఇందుకోసం ఫ్రాప్ కార్న్ యాప్ ను తొలుత డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా సినిమాలు డోన్ లోడ్ చేసుకోవాలి.

ఫ్రాప్ కార్న్ అందించే ఈ సేవలను క్రమంగా విమానాశ్రయం అంతటా, ఇంటర్ సిటీ బస్సుల్లో, ఆసుపత్రుల్లో, హోటళ్లలో విస్తరించాలని భావిస్తున్నారు.