Begin typing your search above and press return to search.

మద్రాసు కుర్చీ కోసం మూడు ముక్కలాట

By:  Tupaki Desk   |   12 Aug 2017 5:06 PM GMT
మద్రాసు కుర్చీ కోసం మూడు ముక్కలాట
X
తమిళ‌నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయేలా... పన్నీర్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చేలా ప్రయత్నాలు సాగుతున్న సమయంలో శశికళ బంధువు దినకరన్ కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అచ్చంగా శశికళ తరహాలోనే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. దీంతో తమిళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

జ‌య‌ల‌లిత మృతి త‌రువాత సీఎం కుర్చీలో కూర్చునేందుకు శశికళ క్యాంపు రాజ‌కీయాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దినకరన్ అదే మార్గంలో వెళ్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించ‌డంతో సీఎం ప‌ళ‌నిస్వామిపై ఆగ్ర‌హంతో ఉన్న దిన‌క‌ర‌న్‌.. త‌న‌ అత్త శశికళ‌ చూపిన దారిలోనే వెళ్లాలనుకుంటున్నారు. ఆయన ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. మ‌రో 20 మంది ఎమ్మెల్యేలకు ఆయన గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావును పళని స్వామి-పన్నీర్ వర్గాలు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దినకరన్ కూడా గ‌వ‌ర్న‌ర్ ను క‌లవాల‌నుకుంటున్నారట. సో... మద్రాసు కుర్చీ కోసం మరోసారి మూడు ముక్కలాట మొదలైనట్లే.