కేశినేని రమేష్ లీలలు ఇన్నిన్ని కావయా.?

Mon Jul 16 2018 12:57:14 GMT+0530 (IST)

కేశినేని రమేష్ లీలలు ఒక్కొక్కొటిగా బయటపడుతున్నాయి.  గురుపీఠం భూ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న రమేష్ అలియాన్ నవీన్ మోసలు చూసి ఇప్పుడు అంతా అవాక్కవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కురిజాడ గ్రామాన్ని దత్తత పేరుతో మోసం చేసినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్నాడని మండిపడుతున్నారు. మొదట ఈ గ్రామంలో ధనవంతుడిగా కటింగ్ ఇచ్చిన రమేష్.. రెండు నెలలు పనిచేయించుకొని కూలీలకు డబ్బులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు..తాజాగా రమేష్ మరో భూ బాగోతం వెలుగుచూసింది. భవానీ గురుపీఠం భూమి అమ్మకం పేరుతో రమేష్ కోటిరూపాయలు ముంచాడనే విషయం బయటపడింది. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ రమేష్ అఖిల భారత భవానీ పీఠాన్ని సంప్రదించాడు. ఆ భూమి నకిలీ డాక్యూమెంట్లు చూపించి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు.

చివరకు భవానీ ఆశ్రమ నిర్వాహకులకు అనుమానం వచ్చి ఆరాతీయగా.. 100 ఎకరాల భూమికి - రమేష్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిసి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు సోమవారం రమేష్ ను అతడి అనుచరుడు సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశాడు. అతని వద్ద ఉన్న రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నాడు. రమేష్ ఇలా పలు మోసాలకు పాల్పడుతూ అందరి వద్ద డబ్బులు కాజేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.