Begin typing your search above and press return to search.

జనవరి 20 ఆదివారం 2019 దినఫలాలు

By:  Tupaki Desk   |   20 Jan 2019 1:30 AM GMT
జనవరి 20 ఆదివారం 2019 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడుతారు. రియల్ ఎస్టేట్ వారికి భూలాభాలు. ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కే సూచనలు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులు సత్తా చాటుతారు. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. వినాయకుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు సంభవం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో విరోధాలు నెలకొంటాయి. ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు అధికం. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంటుంది. మహిళలకు నిరుత్సాహం తప్పదు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఐటీ ఉద్యోగుల సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి పురస్కారాలు దక్కుతాయి. విద్యార్థుల్లో నూతనోత్తేజం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మహిళలకు విదేశీ ప్రయాణాలు ఉంటాయి. గాయత్రీదేవీని ధ్యానించడం మంచిది.

కర్కాటక రాశి: బంధుమిత్రులతో విబేధాలు నెలకొంటాయి. రాబడి నిరాశ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితులు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. ఐటీ ఉద్యోగులు మరింత శ్రమించాలి. విద్యార్థులు ఫలితాల కోసం మరింత కృషి చేయాలి. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు మానసిక అశాంతి. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

సింహ రాశి: ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. పనుల్లో జాప్యం నెలకొంటుంది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఐటీ ఉద్యోగుల యత్నాలు ఫలించవు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. మహిళలకు శుభ సమాచారం. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

కన్యారాశి: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు విధి నిర్వహణలో తప్పటడుగువేసి మాటపడుతారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ ఉద్యోగులకు మార్పులు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: సంఘంలో ఆదరణ పెరుగుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అందరిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. గణేశాష్టకం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధువర్గంతో విబేధాలు తొలగుతాయి. చర, స్థిరాస్తుల లాభం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. సోదరులు, సోదరీలతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ వారికి సన్మానాలు. వ్యాపార లావాదేవీలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులు నగదు పురస్కారం అందుకుంటారు. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకమైన కాలం. ఐటీ నిపుణులకు ఊహించని విదేశీ పర్యటనలు. విద్యార్థులకు అవకాశాలు కలిసివస్తాయి. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

ధనస్సు రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. డాక్యుమెంట్లు నగదు చేజారే సూచనలు. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహం తగ్గుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి నిర్ణయాల్లో జాప్యం. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులు తొందరపాటుతో అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి. దుర్గాదేవీకి కుంకుమార్చన చేయడం మంచిది.

మకర రాశి: పనుల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. బంధువుల తాకిడి పెరుగుతుంది. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మీ వ్యూహాలు తప్పి నిరాశ చెందుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ, కళారంగాల వారికి ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు మార్పులు అనివార్యం. విద్యార్థులు మరింత శ్రమించాలి. అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది.

కుంభరాశి: ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ముందుడుగు వేస్తారు. ఉద్యోగస్థులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ ఉద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యాకాశాలు పొందుతారు. మహిళలు ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో శుభాకార్యాలపై చర్చిస్తారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తులు సమకూర్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో ముందుడుగు వేస్తారు. ఉద్యోగులకు శుభసమాచారం. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులు చికాకులు తొలగి ముందుకు సాగుతారు. ఐటీ ఉద్యోగులు విజయాలు సాధిస్తారు. మహిళలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.