Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో వైసీపీ పోటీ చేసే లెక్క తేలింది

By:  Tupaki Desk   |   11 Oct 2018 12:55 PM GMT
తెలంగాణ‌లో వైసీపీ పోటీ చేసే లెక్క తేలింది
X
హీటెక్కుతున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. కీల‌క‌మైన ఈ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే వ్యూహాల‌ను అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న టీఆర్ఎస్ పార్టీ, మ‌హాకూట‌మికి పెద్ద‌న్న‌గా ఉన్న కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలో విమ‌ర్శలు - ప్ర‌తి విమ‌ర్శ‌లు - ఎత్తుగ‌డ‌లు స‌హ‌జంగానే సాగుతున్నాయి. అయితే, పోటీకి దూరంగా ఉన్న పార్టీల‌పూఐనే అంద‌రి న‌జ‌ర్ ఉండ‌గా...ఆ జాబితాలో వైసీపీ కూడా ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, త‌మ ఎన్నిక‌ల వ్యూహాన్ని తాజాగా వైసీపీ పెద్ద‌లు ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు తెలంగాణ ఏర్పాటుతో అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి స‌హా ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ గూటికి చేరి ఆ పార్టీని విలీనం చేశారు. తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో వైసీపీ వ్యూహంపై అంద‌రి దృష్టి ప‌డింది. ఆ పార్టీ ఏం చేయ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా ఎన్నిక‌ల్లో పోటీ చేసేవ్యూహాన్ని ఫ్యాన్ పార్టీ సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ఖమ్మం - హైదరాబాద్ - రంగారెడ్డి - ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికి కేడర్ ఉన్నట్లుగా బ‌లంగా విశ్వ‌సిస్తున్న వైసీపీ నేతలు ఈ మేర‌కు పోటీ చేసే కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధః చేయాలంటున్నారు. పార్టీ బ‌లాబలాల‌ను పేర్కొంటూ క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ అనంతరం ఏపీలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌ రెడ్డికి నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. 25-30 సీట్ల‌లో పోటీ చేయాల‌ని సిద్ధ‌మవుతున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ని.. సొంతంగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది.