బాబు బండారం బయటపెట్టిన ఐవైఆర్

Thu Dec 06 2018 15:08:38 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ లో సమాజ ప్రయోజనాల కంటే కులాని కే పెద్ద పీఠ వేస్తారనడంతో ఏమాత్రం సందేహం లేదని ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు అంటున్నారు. తాను రాసిన ‘నవ్యాంధ్రలో నా నడక’  అనే పుస్తకంలో చంద్రబాబు పాలన పై ఆయన లేవెనెత్తిన అంశం ఇప్పడు చర్చనీయాంశంగా మారుతోంది.రాష్ట్ర విభజన అనంతరం సీఎస్ గా తన అనుభవాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఇందులో బాబు పాలన ఆయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే జరుగుతుందని తీవ్రంగా ఆక్షేపించారు. అందుకు ఆయన కొన్ని ఉదాహరణలను కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

బ్రహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎవరున్నా టీడీపీ జెండా మోసే వ్యక్తే ఉండాలని చంద్రబాబు నాయుడు స్పష్టం గా తన తో చెప్పారని ఐ వీ ఆర్ పేర్కొన్నారు. పార్టీ కి పనికొచ్చే వారే ఆ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండాలని బాబు స్పష్టం చేశారని తెలిపారు. అంతేకాకుండా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పన్ను  మినహాయింపులోనూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. సినిమాలో చరిత్రను వాస్తవ విరుద్ధంగా తీసినా పన్ను మినహాయింపు ఇచ్చారని ఆరోపించారు.

వీటి పై తాను కొంతమంది వద్ద అభ్యంతాలు వ్యక్తం చేయగా తనను టీడీపీకి వ్యతిరేకిగా ప్రచారం చేశారని ఐ వీ ఆర్ తన పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడంలేదో అర్థం కావడం లేదన్నారు. అదే విధంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం బాబు పాలనలో తీసుకున్న అంశాలను ప్రస్తావిస్తూ తీవ్రంగా దుయ్యబట్టారు.
 
చంద్రబాబు హయాం లో పని చేసిన ఇద్దరు మాజీ సీఎస్ లు ఆయన పై వివిధ అంశాలను లేవనెత్తినా చంద్రబాబు నాయుడు గానీ ప్రభుత్వం గానీ స్పందించడం లేదని ఐ వై ఆర్ పేర్కొన్నారు.. ఆ మాటెత్తితే వాళ్ల కులాలను ఎత్తి విమర్శలు చేస్తున్నారు కానీ.. వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. బాధ్యత గల పదవీ ఉన్న వారే ఇలా వ్యవహరిస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటా అనే ప్రశ్న ఎదురవుతోందన్నారు.. ఏది ఏమైనా ఈ అంశాలను ప్రజలే అర్థం చేసుకోవాలని ఈ విషయాలను వెల్లడిస్తున్నట్టు తెలిపారు...