Begin typing your search above and press return to search.

ఐటీలో వేగంగా ప‌డిపోతున్న ఉద్యోగాల క‌ల్ప‌న‌

By:  Tupaki Desk   |   22 May 2017 6:08 PM GMT
ఐటీలో వేగంగా ప‌డిపోతున్న ఉద్యోగాల క‌ల్ప‌న‌
X
ఐటీ రంగం గురించి ఈ మ‌ధ్య కాలంలో సానుకూల వార్త‌ల కంటే దుర్వార్త‌లు సైతం ఎక్కువ‌గా వ‌స్తున్నట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉద్యోగుల తొల‌గింపుతో ఇక్క‌ట్ల‌లో ఉన్న ఐటీ రంగంలో ఇటీవ‌లి కాలంలో ఉద్యోగుల నియామ‌కం కూడా త‌గ్గింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖ నియామ‌క సేవ‌ల సంస్థ అయిన నౌక‌రీ.కాం తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సర్వేను వెలువ‌రించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐటీ ఇండస్ట్రిలో ఉద్యోగుల నియామకం 24 శాతం పడిపోయినట్టు నౌకరి.కామ్ తాజా సర్వేలో తెలిసింది. జాబ్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతుందని, ఏప్రిల్ నెలలో ఈ నెగిటివ్ వృద్ధి 11 శాతం నమోదు అయింద‌ని, మరికొన్ని నెలల పాటు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగనుందని ఈ విశ్లేష‌ణ పేర్కొంది.

ప‌రిశ్ర‌మ‌లో ఉద్యోగాల క‌ల్ప‌న గురించి విశ్లేషించిన నౌక‌రీ.కాం మొత్తంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌లో 11 శాతం పడిపోయిందని తేల్చింది. టెలికాం, బీపీఓ, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతుందని తెలిపింది. ఇందులో ఎక్కువగా ఐటీ ప‌రిశ్ర‌మ‌లోనే త‌గ్గిపోయాయ‌ని వివ‌రించింది. ఈ ఏడాదిలో 24 శాతం పడిపోయినట్టు నౌకరి జాబ్ సీక్ ఇండెక్స్ నివేదించింది. ఇక మిగ‌తా రంగాలు చూస్తే పరిశ్రమలు, నిర్మాణం, బీపీఓలలో 10 శాతం, 12 శాతం ఉద్యోగుల నియామకం పడిపోయింద‌ని తేల్చింది. బ్యాంకింగ్ సెక్టార్ లో 11 శాతం తగ్గిపోయిందని విశ్లేషించింది. ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాలైన ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నైలోనే ఏడాది ఏడాదికి ఉద్యోగుల కల్పన తగ్గిపోయినట్టు ఈ ఇండెక్స్ పేర్కొంది.