Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాకు బానిసైతే...

By:  Tupaki Desk   |   21 July 2019 7:39 AM GMT
సోషల్ మీడియాకు బానిసైతే...
X
స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. దానికి అనుగుణంగానే ఉచిత కాల్స్ - డేటా ప్యాకేజీలు వచ్చేసాయి. నెలకు ఒకసారి వేసుకుంటే చాలు ఇక ఇంటర్నెట్ అంతా ఫ్రీ.. పైగా వైఫైలు అంతటా ఉండేవే. అందుకే హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 25శాతం డేటా వినియోగం పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు హైదరాబాద్ లో డేటా వినియోగం పెరిగిపోతూనే ఉందట..

అయితే ఇది అభివృద్ధికి పాటుపడితే ఏం పర్లేదు. కానీ మనుషులను బానిసలుగా మారుస్తుండడమే ఇప్పుడు ప్రమాదంగా మారింది.. హైదరాబాద్ నగరంలోని యువత - పెద్దలు ఫేస్ బుక్ - ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ - టిక్ టాక్ వంటి వాటితో రోజంతా గడిపేస్తున్నారట.. లైక్ లు - కామెంట్ల కోసం వెంపర్లాడుతూ పిచ్చోళ్లు అయిపోతున్నారు. అవి రాకపోతే మానసికంగా కృంగిపోతున్నారని తాజా సర్వేలో తేలింది.

రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ తాజాగా నిర్వహించిన సర్వేలో 16 నుంచి 24 ఏళ్ల వయసులో 91శాతం మంది సోషల్ మీడియాకు బానిసగా మారిపోయారట.. ఇక 25-34 ఏళ్ల వయసులో 80శాతం మంది - 35-44 ఏళ్ల వయసులో 70శాతం మంది అతిగా సోషల్ మీడియాను వాడుతున్నారని తేలింది. దీంతో వారిలో చాలా మంది స్థూలకాలం - మెడక - వెన్నుపూజ - కంటి సమస్యల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో ఇంటిల్లిపాది ఇప్పుడు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. పగలూ రాత్రి అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. చిన్నారులు - పెద్దలు - మహిళలు - స్మార్ట్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో నిద్రలేమితో డిప్రెషన్ తో కంటి సమస్యలు - మెడ నరాలు ఇతర సమస్యలతో వైద్యుల వద్దకు రోగులు పెరుగుతున్నారట.. లైక్ లు కూడా రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్లి ఆస్పత్రుల పాలవుతున్నారట.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వల్ల హైదరాబాద్ లో ఈ కేసులు ఎక్కువయ్యాయని వైద్యులు చెబుతున్నారు.