Begin typing your search above and press return to search.

క‌స‌బ్ బ‌లుపు అప్ప‌టికి కానీ తీర‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   13 Nov 2018 5:25 AM GMT
క‌స‌బ్ బ‌లుపు అప్ప‌టికి కానీ తీర‌లేద‌ట‌!
X
ప‌లువురు అమాయ‌కుల ప్రాణాల్ని క‌ర్క‌శంగా చిదిమేసిన న‌ర‌హంత‌కుడు క‌స‌బ్ గురించి తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. ఉన్మాదంతో తుపాకీ ప‌ట్టుకొని విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన క‌స‌బ్ కు ఉరిశిక్ష‌ను ఆల‌స్యంగా అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా అధికారుల‌కు త‌న తీరుతో చుక్క‌లు చూపించిన అత‌గాడు.. ఉరికి ముందు ఎలా ఉన్నాడు? ఏం మాట్లాడార‌న్న విష‌యాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు.

అయితే.. అత‌డితో చాలా ఎక్కువ కాలం ప‌రిచ‌యం ఉన్న సీనియ‌ర్ పోలీస్ ఇన్ స్పెక్ట‌ర్ ర‌మేశ్ మ‌హాలే తాజాగా కొన్ని అంశాల్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించారు. 2008 న‌వంబ‌రు 26న ముంబ‌యిలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో విధ్వంసం సృష్టించిన క‌స‌బ్ ను 2012 న‌వంబ‌రు 21న ఉరి తీసిన సంగ‌తి తెలిసిందే.
పోలీసుల అదుపులో ఉండి..నాయిర్‌ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌స‌బ్ ను ఆ కేసు విచార‌ణాధికారి.. ముంబ‌యి క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 1 ప్ర‌ధాన విచార‌ణాధికారి ర‌మేశ్ మ‌హాలే తొలిసారి క‌లిశారు. క‌స‌బ్ ను ఉరి తీసిన ఆరేళ్ల త‌ర్వాత నాటి సంగతుల్ని బ‌య‌ట‌పెట్టారు.

క‌స‌బ్‌నుంచి నిజాన్ని రాబ‌ట్ట‌టం అంత సులువైన విష‌యం కాద‌న్న విష‌యాన్ని త్వ‌ర‌గానే గుర్తించారు. అంతేకాదు.. మిగిలిన నేర‌స్తుల చేత నిజాన్ని చెప్పించటానికి ఉప‌యోగించే ప‌ద్ద‌తుల్ని క‌స‌బ్ విష‌యంలో చేయ‌టానికి అవ‌కాశం లేద‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లు చెప్పారు. అత‌డు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ఏర్పాట్లు చేసి.. నోరు విప్పే వ‌ర‌కూ వెయిట్ చేయాల‌ని తాము భావించిన‌ట్లుగా ర‌మేశ్ చెప్పారు. దాదాపు నెల‌న్న‌ర పాటు త‌మ అదుపులో ఉన్న క‌స‌బ్ ఆలోచ‌నాధోర‌ణిని అర్థం చేసుకునే అవ‌కాశం ల‌భించింద‌న్నారు. ఇందులో భాగంగా తాను క‌స‌బ్ కు రెండు జ‌త‌ల బ‌ట్ట‌లు కూడా కొనిపించిన‌ట్లుగా చెప్పారు.

త‌న నేరం రుజువై.. ఉరి ప‌డినా శిక్ష అమ‌లు కాద‌న్న ధీమాతో క‌స‌బ్ ఉండేవాడ‌న్నారు. అదే విష‌యాన్ని త‌న‌తో చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. విచార‌ణ‌లో భాగంగా అధికారులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు క‌స‌బ్ సూటిగా స‌మాధానం చెప్పేవాడు కాద‌ని.. పొంత‌న లేని స‌మాధానాలు చెప్పే వార‌న్నారు. తాను అమితాబ్‌ను చూడ‌టానికి ముంబ‌యి వ‌స్తే.. త‌న చేతిలో తుపాకీ పెట్టి.. త‌న చేతికి గాయం చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పాడ‌న్నారు. త‌న‌ను బ‌ల‌వంతంగా కేసులో ఇరికించిన‌ట్లుగా చెప్పేవాడ‌న్నారు. కోర్టు ఊరిశిక్ష వేసినా పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌లేద‌ని.. ఆ శిక్ష భార‌త్ లో అమ‌లు అయ్యే అవ‌కాశం ఉండ‌ద‌న్న మాట క‌స‌బ్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు.

శిక్ష‌ను అమ‌లు చేయ‌టానికి ఒక రోజు ముందు తాను క‌స‌బ్ ను క‌లిశాన‌ని.. గ‌తంలో అత‌డు చేసిన వ్యాఖ్య‌ల్ని గుర్తు చేసి.. శిక్ష అమ‌లు కాద‌న్నావుగా అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తే.. తాను ఓడిపోయాన‌ని.. మీరే గెలిచిన‌ట్లుగా వ్యాఖ్యానించార‌న్నారు. ఊరిశిక్ష అమ‌లు నిర్ణ‌యం అనంత‌రం.. అత‌డిలో బ‌లుపు త‌గ్గిన‌ట్లుగా పేర్కొన్నారు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న అతిశ‌యం మాట‌లు పోయి చావు భ‌యం ప‌ట్టుకుంద‌ని.. ఉరి అమ‌లుకు ముందు రోజు నుంచి శిక్ష అమ‌లు వ‌ర‌కూ కామ్ గా ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు.