Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు రావాల్సిన ఐడియా యోగికి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   24 July 2017 12:00 PM GMT
కేసీఆర్ కు రావాల్సిన ఐడియా యోగికి వ‌చ్చింది
X
కొన్ని ప‌థ‌కాలు చూసిన వెంట‌నే కొంద‌రికి స‌రిగ్గా స‌రిపోతాయ‌నిపించ‌క మాన‌దు.తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తెర‌పైకి తీసుకొచ్చిన ఒక ప‌థ‌కాన్ని చూసిన వెంట‌నే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తుకు వ‌చ్చేలా ఉండ‌టం విశేషం. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌తో పాటు.. మ‌హిళ‌ల‌కు సంబంధించిన ప‌థ‌కాల్ని అమ‌లు చేసే విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం క‌నిపిస్తుంది. మ‌హిళ‌ల రక్ష‌ణ కోసం షీ టీమ్స్ ఏర్పాటుతో పాటు.. ఆర్టీసీ బ‌స్సుల్లో పురుషుల‌కు.. స్త్రీల‌కు మ‌ధ్య ఇనుప కంచెను ఏర్పాటు చేయ‌టం లాంటివెన్నో చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా యూపీ సీఎం యోగి త‌మ రాష్ట్రంలోని మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ఒక‌టి ప్ర‌క‌టించారు. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా గులాబీ రంగు ఏసీ బ‌స్సుల్ని ప్ర‌త్యేకంగా తీసుకురానున్నారు. ఈ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉంటుంది. సిబ్బంది కూడా మ‌హిళ‌లే ఉండ‌నున్నారు. నిర్భ‌య నిధి నుంచి కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ విడుద‌ల చేసిన నిధుల‌తో ఇప్ప‌టికే 50 బ‌స్సుల‌కు ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం.

కేంద్రం నిధుల‌తో గులాబీ బ‌స్సుల్ని కొనుగోలు చేస్తున్న యోగి స‌ర్కారు.. ప‌నిలో ప‌నిగా యూపీఎస్ ఆర్టీసీకి చెందిన 12,500 బ‌స్సుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ చేసింది. అంతేకాదు.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎదురైన ప‌క్షంలో ప్యానిక్ బ‌ట‌న్‌ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. గులాబీ రంగు ఏసీ బ‌స్సులు త్వ‌ర‌లో యూపీ రోడ్ల మీద తిర‌గ‌నున్నాయి. మ‌రి.. అదే రీతిలో తెలంగాణ‌లో తిరిగితే ఆ మైలేజ్ వేర‌న్న విష‌యం ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. మ‌రి.. కేసీఆర్‌ కు రావాల్సిన ఐడియా యోగికి రావ‌టం ఏంటి? ఇప్ప‌టికైనా యోగి ఐడియాను కేసీఆర్ తెలంగాణ‌లో అమ‌లు చేస్తారా?