Begin typing your search above and press return to search.

అంబేద్కర్ పేరులో రామ్‌ - విగ్రహానికి కాషాయం..

By:  Tupaki Desk   |   10 April 2018 8:26 AM GMT
అంబేద్కర్ పేరులో రామ్‌ - విగ్రహానికి కాషాయం..
X
ఉత్తరప్రదేశ్‌ లోని బదౌన్‌ లో ఇటీవల విధ్వంసానికి గురైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మించారు. అయితే ఈ విగ్రహం కాషాయ రంగులో ఉండటంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. బదౌన్ జిల్లా యంత్రాంగం అదేశాలననుసారం బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటీవలే భీంరావ్ అంబేద్కర్ పేరును ఇకపై పూర్తి రూపంలో వాడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసందే.. చాలామంది రాజ్యాంగ నిర్మాత పూర్తిపేరు భీంరావ్ రామ్‌ జీ అంబేద్కర్ అని తెలియదని.. ఇకపై అంబేద్కర్ పేరు మధ్యలో 'రామ్‌ జీ' ని జోడించి వాడనున్నట్లు తెలిపింది.

కాగా మొన్న శుక్రవారం రాత్రి బదౌన్ జిల్లాలోని దుగ్రియ్య గ్రామంలో అంబేద్కర్ విగ్రహం విధ్వంసం గురైంది. దీంతో నిరసనలు మొదలయ్యాయి. నిరసనల తరువాత జిల్లా యంత్రాంగం ఆగ్రా నుండి ఈ కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా నీలం రంగులో ఉండే అంబేద్కర్ విగ్రహం.. ఇక్కడ కాషాయ రంగులో ఉంది. దీంతో ఇది యోగి కుట్రేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, 'కాషాయ' అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్నించేటప్పుడు అక్కడ బీఎస్పీ నాయకుడు హేమేంద్ర గౌతం తన మద్దతుదారులతో పాటు ఉన్నారు.

యూపీ ప్రభుత్వం కాషాయ రంగు మీదున్న ప్రేమతో ఇటీవలే మునిసిపల్ కార్పోరేషన్ ద్వారా లక్నో గోమతి నగర్‌ లో అనేక పార్కులు - డివైడర్లకు కాషాయ రంగు ఇచ్చిన సంగతి తెలిసిందే...! గత ఏడాది డిసెంబర్‌ లో లక్నోలోని హజ్ కార్యాలయ గోడలకు కాషాయ రంగు పెయింట్ వేయడం సమస్యగా మారింది. ప్రతిపక్ష, ముస్లిం మతం సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో గోడలకు క్రీమ్ కలర్ వేయించారు మళ్లీ.