Begin typing your search above and press return to search.

ఆ సీఎం కాన్వాయ్ కారు మిస్

By:  Tupaki Desk   |   21 April 2017 5:36 AM GMT
ఆ సీఎం కాన్వాయ్ కారు మిస్
X
యూపీ అధికారుల‌కు చెమ‌ట‌లు పుట్టించిన ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి కాన్వాయ్ లో ఉండాల్సిన కారు ఉన్న‌ట్లుండి మాయ‌మ‌య్యేస‌రికి వ‌ణుకు పుట్టింది. అప్ప‌టివ‌ర‌కూ త‌మ‌తో ఉన్న కారు క‌నిపించ‌క‌పోయేస‌రికి.. ఏమైందో అర్థం కాక కిందామీదా ప‌డిపోయే ప‌రిస్థితి. అస‌లు కొత్త ముఖ్య‌మంత్రి.. అందులోకి య‌మా స్ట్రిక్ట్‌. అలాంటి సీఎంకు సంబంధించి.. ఆయ‌న కాన్వాయ్ కారే మిస్ అయ్యిందంటే అంత‌కు మించిన విష‌యం ఏముంటుంది? అందుకే.. కారుక‌నిపించ‌కుండా పోయేస‌రికి ఆగమాగ‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది.. అస‌లు విష‌యం తెలిసి హ‌మ్మ‌య్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

యూపీ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ తాజాగా బుందేల్ ఖండ్ లోని ఝూన్సీ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. అక్క‌డి వికాస్ భ‌వ‌న్ లో జ‌రిగిన జిల్లా అధికారుల స‌మావేశంలో పాల్గొన్నారు. అప్ప‌టివ‌ర‌కూ అక్క‌డే ఉన్న సీఎం కాన్వాయ్ లోని వాహ‌నం ఒకొటి మిస్ కావ‌టంతో ఒక్క‌క్ష‌ణం ఏమీ అర్థం కాలేదు.వెంట‌నే అలెర్ట్ అయి.. కారు కోసం వెదుకులాట షురూ చేశారు.

ఈ ఉదంతాన్ని వైర్ లెస్ సెట్లో చెప్పేయ‌టంతో భ‌ద్ర‌తా సిబ్బంది అంతా ఒక్క‌సారిగా అలెర్ట్ అయిపోవ‌ట‌మే కాదు.. అలా ఎలా జ‌రిగింద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. మ‌రేదో.. మ‌రేదో అయితే ఫ‌ర్లేదు.. ఏకంగా సీఎం కాన్వాయ్ కారే మిస్ కావ‌టంతో.. ఆ కారున ప‌ట్టుకోవ‌టానికి అధికారులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రంగంలోకి దిగారు. కారు గురించి ఆరా తీయ‌టం మొద‌లెట్టారు. అయితే జ‌రిగిందేమంటే.. సీఎం వాహ‌నాల్ని ఉంచిన స‌ర్క్యూట్ హౌస్ ద‌గ్గ‌రే కాన్వాయ్ కార్లు పెట్టాలి. అయితే.. ఆ విష‌యంలో చిన్న పొర‌పాటు చోటు చేసుకోవ‌టంతో.. కారును ప‌క్క‌కు పెట్టారు.

సంబంధం లేని ప్రాంతంలో కారు నిలిపి ఉండ‌టంతో.. అక్క‌డి ట్రాఫిక్ అధికారులు కారును త‌ర‌లించారు. వారికి సైతం అది సీఎం కాన్వాయ్‌లోని కారు అని తెలియ‌పోవ‌టంతో కారును తీసేశారు. కారుడ్రైవ‌ర్ ప‌క్క‌కు వెళ్లి తిరిగి వ‌చ్చేస‌రికి కారు క‌నిపించ‌క‌పోయేస‌రికి.. కంగారు ప‌డి ఉన్న‌తాధికారుల‌దృష్టికి తీసుకెళ్లారు. మొద‌ట్లో ఆందోళ‌న ప‌డి కారు ఆచూకీ కోసం ప‌రుగులు తీసిన అధికారులు.. విష‌యం తెలిసి ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్య‌మంత్రిగా యోగి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత బుందేల్ ఖండ్‌ లో ప‌ర్య‌టించ‌టం ఇదే తొలిసారి కావ‌టం.. ఆ సంద‌ర్భంగా ఇంత హ‌డావుడి చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/