Begin typing your search above and press return to search.

ఆ సీఎంను హాలీవుడ్ హీరోను చేసేశారు..

By:  Tupaki Desk   |   19 March 2017 11:03 AM GMT
ఆ సీఎంను హాలీవుడ్ హీరోను చేసేశారు..
X
ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై.. త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే బీజేపీ సీనియ‌ర్ నేత యోగి అదిత్య‌నాథ్ లో ఎప్పుడూ క‌నిపించ‌ని కొత్త కోణం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న్ను యూపీ పీఠం మీద కూర్చునేలా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పుణ్య‌మా అని ఇప్పుడాయ‌న హాట్ టాపిక్ గా మారారు. ఊహించ‌ని రీతిలో మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో అదిత్య‌నాథ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న్ను అభిమానించే వారే కాదు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వారు పుట్టుకొచ్చారు. మోడీ నిర్ణ‌యాన్ని తిట్టిపోసే వారు.. తిట్టిపోస్తుంటే.. అందుకు భిన్నంగా ఆయ‌న్లో స‌రికొత్త హీరోను చూస్తున్న వారి సంఖ్య త‌క్కువేం కాదు. తాజాగా అలాంటి కోణాన్నే చూసిన వారి పుణ్యంగా త‌యారైన ఒక పోస్ట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

మ‌రికాసేప‌ట్లో (ఆదివారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో) ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న అదిన్య‌నాథ్ అచ్చు హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ మాదిరి ఉన్న‌ట్లుగా ఇరువురి ఫోటోల్ని ప‌క్క‌న‌ప‌క్క‌న పెట్టిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రి ఫోటోలు చూసినంత‌నే ఒకేలా ఉండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా మార‌ట‌మే కాదు.. ఇంత‌కాలం ఆదిత్య నాథ్‌ లో ఈ కోణం క‌నిపించ‌లేదేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొనే న‌టించిన ట్రిపుల్ ఎక్స్ మూవీలో విన్ డీజిల్ భార‌తీయుల‌కు మ‌రింత సుప‌రిచితులుగా మారారు. ఈ ఫోటోల పుణ్య‌మా అని స‌న్యాసి యోగి ఆదిత్య‌నాథ్‌ ను.. కంగ్రాట్స్ విన్ డీజిల్ అంటూ అభినందించేవారే కాదు.. దీపికా ప‌దుకొనే ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి స‌ర‌దా కామెంట్లు చాలానే చేసేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/