Begin typing your search above and press return to search.

5ల‌క్ష‌లా? 10ల‌క్ష‌లిస్తా..నా భ‌ర్త ప్రాణాలు తెండి

By:  Tupaki Desk   |   23 April 2017 6:23 AM GMT
5ల‌క్ష‌లా? 10ల‌క్ష‌లిస్తా..నా భ‌ర్త ప్రాణాలు తెండి
X
ప్రాణానికి ప‌రిహారం ఎంత‌మాత్రం స‌రికాదు. ఏదైనా జ‌రిగిన వెంట‌నే.. మిగిలిన రాష్ట్రాల పాల‌కుల‌కు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల పాల‌కులు చిత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఏదైనా ప్ర‌మాదం కానీ.. విప‌త్తు కానీ.. న‌ష్టం కానీ వాటిల్లితే వాటిని డ‌బ్బుల‌తో కొలిచేస్తుంటారు. ఓప‌క్క ఆ విప‌త్తు.. ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు ఒక కొలిక్కి రాక ముందే.. ముఖ్య‌మంత్రో.. మంత్రులో న‌ష్ట‌ప‌రిహారాన్ని మీడియా ఎదుట ప్ర‌క‌టించి.. చాలా దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్న వాద‌న‌ను వినిపిస్తుంటారు.

అప్ప‌టికే అయినోళ్ల‌ను పోగొట్టుకొని పుట్టెడు శోకంతో ఉన్న వారికి.. ప్ర‌భుత్వాధినేత‌ల నోటి నుంచి వ‌చ్చే మాట‌లు క‌డుపు మండిపోయేలా చేస్తుంటాయి. పాల‌కులు చేసే త‌ప్పుల‌కు త‌మ వాళ్ల ప్రాణాలు పోవ‌టం ఏమిటంటూ నిల‌దీస్తుంటారు. ఇలాంటి నిల‌దీత ఒక‌టి ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వ లోపాన్ని ఎత్తి చూపేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

సంచ‌ల‌నం సృష్టించిన చిత్తూరు జిల్లా ఏర్పుడు లారీ ప్ర‌మాదంలో పెద్ద ఎత్తున అమాయ‌కులు మ‌ర‌ణించ‌టం తెలిసిందే. ఘ‌ట‌న‌స్థలంలో 15 మంది మ‌ర‌ణించ‌గా.. మ‌రొక‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ప్ర‌మాదానికి అస‌లు కార‌ణం.. దానికి బాధ్యులు.. ఎవ‌రి త‌ప్పు వ‌ల్ల ఇంత ఘోర ప్ర‌మాదం జ‌రిగింద‌న్న‌ది అక్క‌డి వారందరికి తెలిసిందే. కానీ.. వాటిని ప‌ట్టించుకోకుండా.. న‌ష్ట‌ప‌రిహారాన్ని అందించేందుకు వ‌చ్చిన నేత‌ల‌కు దిమ్మ తిరిగిపోయే షాక్ త‌గిలింది. ప‌రిహారం ఇచ్చేసి.. నాలుగు క‌న్నీటి చుక్క‌లు రాల్చేసి.. ఎంత ఘోరం జ‌రిగిపోయింద‌న్న మాట చెప్పేసి వ‌ద్దామ‌ని వెళ్లిన అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేకి ఊహించ‌ని రీతిలో సీన్ రివ‌ర్స్ అయ్యింది.

ఏర్పేడు మృతుల కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన మాజీ మంత్రి.. ఎమ్మెల్యే బొజ్జ‌ల గోపాల‌ కృష్ణారెడ్డి న‌డుం బిగించారు. మృతుల్లో ఒక‌రైన రేష‌న్ డీల‌ర్ గా ప‌ని చేసే నాగేశ్వ‌ర‌రావు కూడా లారీ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న భార్య ర‌త్న‌మాలను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన బొజ్జ‌ల‌.. పరిహారం కింద రూ.5ల‌క్ష‌లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా బాధితుడి స‌తీమ‌ణి రోదిస్తూ.. తాము ఇసుక త‌వ్వే వాళ్ల మీద ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. స్పందించ‌లేద‌ని.. తాము చెప్పిన‌ప్పుడే చ‌ర్య‌లు తీసుకొని ఉంటే.. ఇప్పుడీ రోజున ప్ర‌మాద‌మే జ‌రిగి ఉండేది కాద‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ప్ర‌మాదం జ‌రిగి.. ఘోరం సంభ‌వించిన త‌ర్వాత వ‌చ్చిన ముఖం తుడిచే దానికి రూ.5ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెబుతున్నార‌ని.. తాను రూ.10ల‌క్ష‌లు ఇస్తాన‌ని.. చ‌నిపోయిన త‌న భ‌ర్త‌ను తీసుకురావాల‌ని బొజ్జ‌ల‌ను నిల‌దీశారు.

ఇక్క‌డి ఈ విష‌యం ఆగ‌లేదు. బొజ్జ‌ల‌కు ఆరోగ్యం బాగోలేదంటే.. ఆయ‌న ఆరోగ్యం వెంట‌నే కుదుట ప‌డాలంటూ తాము ప్రార్థ‌న‌లు చేశామ‌ని.. మీ ఆరోగ్యం బాగుండాల‌ని దేవుడ్ని కోరుకున్నాం.. కానీ మీరు మాత్రం చేశారు? అక్ర‌మంగా ఇసుక తీసుకెళ్లే వారిపై ప‌రిమితులు విధిస్తే.. ఇప్పుడీ దారుణం జ‌రిగి ఉండేది కాదు క‌దా? అని ఆవేద‌న‌తో నిల‌దీస్తుంటే రాజ‌కీయాల్లో త‌ల నెరిసిన బొజ్జ‌ల లాంటి నాయ‌కుడి నోటి నుంచి మాట రాని ప‌రిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/