Begin typing your search above and press return to search.

ఆ వాయిస్ నాది కాదు..

By:  Tupaki Desk   |   9 Feb 2019 7:03 AM GMT
ఆ వాయిస్ నాది కాదు..
X
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు బీజేపీ కర్ణాటక సీనియర్ నాయకుడు యడ్యూరప్ప.. తాజాగా జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడకు రూ.25 లక్షలు ఎరవేసి మంత్రి పదవి హామీ ఇచ్చిన ఆడియో టేపును కర్ణాటక సీఎం కుమారస్వామి విడుదల చేయడం కలకలం రేపుతోంది. తమ ఎమ్మెల్యేలకు డబ్బులు, మంత్రి పదవులను బీజేపీ ఆఫర్ చేసిందని కుమారస్వామి ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

తన ఆడియో టేప్ లీక్ కావడంపై సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు. కుమారస్వామి చేసిన ఆరోపనలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఆ ఆడియో అబద్దమని.. తనను ఇరికించాలనే ఈ వీడియోను సృష్టించారని ఆరోపించారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాని సవాల్ విసిరారు. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడకు డబ్బు ఎరవేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలన్నీ అవాస్తవమని యడ్యూరప్ప వెల్లడించారు.

కాగా తాజాగా న్యాయవాది మూర్తి బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యే మల్లేశ్వరం, అశ్వత్ నారాయణ్ తో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసన సభ్యులను వీరు కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని.. బలవంతంగా నిర్బంధించారని పేర్కొన్నారు.