Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'క‌ల‌' కు భారీ గుర్తింపు

By:  Tupaki Desk   |   22 July 2018 4:51 AM GMT
కేసీఆర్ క‌ల‌ కు భారీ గుర్తింపు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఒక స‌మాచారం ఫుల్ హ్యాపీ అయ్యేలా చేసింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఆల‌యానికి ద‌క్క‌ని ఘ‌న‌త ఆయ‌న క‌ల అయిన యాదాద్రి టెంపుల్ కు ద‌క్క‌టం ఆయ‌న్ను భారీ సంతోషానికి గుర‌య్యేలా చేసింది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో ఎలా అయితే తిరుమ‌ల ప్ర‌సిద్ధో.. అంతే ప్రాధాన్య‌త త‌మ‌కు ద‌క్కేలా చేయ‌టం కోసం అప్పట్లో యాద‌గిరిగుట్ట‌.. ఇప్పుడు యాదాద్రిగా మారిన దేవాల‌యానికి ద‌క్కాల‌న్న ఆశ‌ను.. ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

యాదాద్రి రూపురేఖ‌లు మారిపోయేలా చేయ‌టం కోసం ఆయ‌న భారీ క‌స‌ర‌త్తు చేయ‌ట‌మే కాదు.. యాదాద్రిని ప్ర‌ముఖ ఆల‌యంగా మార్చేందుకు మాస్ట‌ర్ ప్లాన్ ఒక‌టి త‌యారు చేయించ‌టం.. దానికి సంబంధించిన ప‌నులు చేయిస్తుండ‌టం తెలిసిందే. కోట్లాది రూపాయిల ఖ‌ర్చుల‌తో యాదాద్రి మొత్తాన్ని మార్చేస్తున్న కేసీఆర్ కు.. తాజాగా ఆ ఆల‌యానికి దేశంలో మ‌రే టెంపుల్‌కు ద‌క్క‌ని ఐఎస్ వో ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ల‌భించింది.

దేశంలో మ‌రే ఆల‌యానికి ఈ త‌ర‌హా గుర్తింపు లేద‌ని.. యాదాద్రి తొలి ఆల‌యంగా ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంద‌ని చెబుతున్నారు. ఈ హ్యాపీ న్యూస్ ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌టం.. ఆయ‌న వెంట‌నే అపాయింట్ ఇవ్వ‌టం జ‌రిగిపోయాయి. ఈ సంద‌ర్భంగా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఆయ‌న‌కు చూపించారు. ప‌ర్యావ‌ర‌ణ‌.. నిర్వాహ‌ణ‌.. భ‌ద్ర‌త‌.. విద్యుత్ స‌ర‌ఫ‌రా త‌దిత‌ర విభాగాల్లో యాదాద్రి టెంపుల్‌కు ఐఎస్ వో ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ల‌భించిన‌ట్లు వెల్ల‌డించారు. మొత్తానికి కేసీఆర్ క‌ల‌కు ల‌భించిన గుర్తింపు ఆయ‌న్ను సంతోషంగా మార్చ‌ట‌మే కాదు.. ఆల‌య ప్ర‌చారానికి మ‌రింత తోడ్పాటును అందిస్తుంద‌ని చెబుతున్నారు.