Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై ప‌గ తీర్చుకున్న వైసీపీ

By:  Tupaki Desk   |   23 Aug 2016 2:56 PM GMT
కేసీఆర్‌ పై ప‌గ తీర్చుకున్న వైసీపీ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ సంద‌ర్భం దొరికిన వెంట‌నే త‌న క‌సిని తీర్చుకుంది. జిల్లాల విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ పార్టీకి ఆహ్వానం పంపనందుకు అవ‌మానంగా భావించిన వైసీపీ ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే అవ‌కాశం దొర‌క‌గానే కేసీఆర్ స‌ర్కారు తీరుపై వైసీపీ మండిప‌డింది. తెలంగాణ‌ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర స‌ర్కారుతో చేసుకున్న ఒప్పందం చీక‌టి ఒప్పందంగా అభివ‌ర్ణించింది. అది మ‌హా ఒప్పందం కాదు మ‌హా మోసం అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు శివ‌కుమార్ దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ ప‌రువు - ఆత్మ‌గౌర‌వాన్ని మహారాష్ట్ర వ‌ద్ద తాక‌ట్టు పెట్టిన కేసీఆర్ క‌మీష‌న్ల కోస‌మే ఒప్పందం చేసుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తమ పార్టీ స్పూర్తి ప్ర‌దాత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలంగాణ‌కు నీటిని తెచ్చేందుకు తీర్చిదిద్దిన ప్రాజెక్టుల‌ను రీ డిజైనింగ్ పేరుతో చింద‌ర వంద‌ర చేస్తూ అదే గొప్పగా అభివ‌ర్ణించుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. తుమ్మ‌డిహ‌ట్టి - మేడిగ‌డ్డ వ‌ద్ద నిర్మించే బ్యారేజీల ఎత్తు త‌గ్గించ‌డం ద్వారా మ‌హా ఒప్పందం పేరుతో మ‌హా మోసం చేశార‌ని శివ‌కుమార్ విమ‌ర్శించారు. ఈ ఒప్పందంపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కోరారు.