టీడీపీ చేసిన దుష్ప్రచారం సంగతి ఏంటి?

Thu May 18 2017 21:46:57 GMT+0530 (IST)

సోషల్ మీడియాపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్న ఏపీ సర్కారు తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. ఏపీలో పాలన పక్కదోవ పట్టిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ చేసిన వ్యాఖ్యలతో అయిన చంద్రబాబు కళ్లు తెరవాలని కోరారు. చంద్రబాబు పాలన రాజ్యాంగబద్ధమని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ రాష్ట్ర ప్రజలు నమ్మలేని విషయాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగబద్దమా? అని ప్రశ్నించారు.

``ఖట్జూ గారి కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి చూపితే ఊరుకుంటారా అని పరకాల ప్రశ్నించారు. మరి గతంలో వైఎస్ కుటుంబంపై టీడీపీ పెట్టిన అభ్యంతరకర పోస్టులు గుర్తుకు రాలేదా? అంటే టీడీపీ  ఏం చేసిన సరైనది ప్రజాస్వామ్యబద్దమైనది అవుతుంది. అదే పని ఇతరులు చేస్తే తప్పు శిక్షకు అర్హం అవుతుందా?`` అని పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారని పార్థసారథి నిలదీశారు. ``పోలీస్ వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తున్నది వాస్తవం కాదా..?నిజాయితీగా పనిచేసే అధికారులపై దాడులు జరుగుతున్నా చర్యలు ఎందుకు లేవు. ఓ వ్యక్తి ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేస్తే టీడీపీ ముఖ్యనేతలే నిందితులకు కొమ్ముకాస్తున్నారు. నిజాయితీ కలిగిన ఐపీఎస్ పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తే  సాక్షాత్తు సీఎం పంచాయతీ చేస్తారా..?`` అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కలకలం సృష్టించిన హవాలా కుంభకోణంలకు టీడీపీ మంత్రుల అండదండలు ఉన్నాయని పార్థసారథి ఆరోపించారు. నేరాలను టీడీపీ వ్యవస్థీకృతం చేస్తోందని మండిపడ్డా. నేరాలకు ఈ ప్రభుత్వం లైసెన్సులు ఇస్తోందని మండిపడ్డారు. విజయవాడలో నేరాలు చూసి రాష్ట్రం భయపడుతోందని పార్థసారథి పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/