Begin typing your search above and press return to search.

ఆ విషయంలో తప్పిదం చేస్తున్న వైఎస్సార్సీపీ!

By:  Tupaki Desk   |   23 March 2019 8:07 AM GMT
ఆ విషయంలో తప్పిదం చేస్తున్న వైఎస్సార్సీపీ!
X
ఒకవైపు టీవీ యాడ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఏ టీవీ చానల్ పెట్టినా టక్కున తెలుగుదేశం యాడ్సే ప్రసారం అవుతున్నాయా. ప్రతి చానల్ లోనూ ప్రతి పదిహేను నిమిషాలకూ తెలుగుదేశం పార్టీ యాడ్స్ ప్రదర్శితం అవుతున్నాయి. బాబు అలా చేశాడు.. ఇలా చేశాడు.. బాబు పెద్ద కొడుకు అయ్యాడు.. అంటూ తెలుగుదేశం పార్టీ టీవీ యాడ్స్ సాగుతున్నాయి. వీటిని ప్రజలు ఏ మేరకు నమ్ముతారు అనే సంగతిని పక్కన పెడితే.. తెలుగుదేశం అయితే తన వంతు ప్రయత్నం సాగిస్తూ ఉంది.

అయితే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఊపు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీవీ యాడ్స్ ఊసే లేదు. ఏవో కొన్ని వచ్చినా.. అవి అంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ యాడ్స్ చాలా క్వాలిటీతో - తెలుగుదేశం అజెండాను చాటుతూ ఉన్నాయి.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయింది. ఈ విషయం స్పష్టం అవుతోంది. దీంట్లో కొంత పీకే టీమ్ స్ట్రాటజీ కూడా ఉందని సమాచారం. ఓటింగ్ విషయంలో టీవీ యాడ్స్ ప్రభావం అంతా ఉండదనేది ప్రశాంత్ కిషోర్ లెక్క అట. అందుకే టీవీ యాడ్స్ రూపకల్పనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపించలేదని సమాచారం.

అయితే ఎన్నికల వేళ ఇలాంటి అలసత్వాలు లెక్కలు పనికి రావని చెప్పవచ్చు. ఒకవైపు టీవీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ భారీగా యాడ్స్ ను ఇస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ ఈ యాడ్ క్యాంపెయిన్ ను చేస్తున్నట్టుగా సమాచారం.

అటు టీవీ యాడ్స్ విషయంలో చూసినా, ఇటు సోషల్ మీడియా యాడ్స్ విషయంలో చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంత జోష్ తో కనిపించకపోవడం మాత్రం గమనార్హం. మరికాస్త సమయం ఉంది కాబట్టి..ఈ లోపు జగన్ పార్టీ ఈ విషయం మీద దృష్టి పెడుతుందేమో చూడాలి!