నేను గెలిచాను - మా బాస్ గెలిచాడు - రోజా

Thu May 23 2019 16:40:26 GMT+0530 (IST)

మాజీ సినీ నటి - వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆమె తన గెలుపుతో భావోద్వేగానికి గురయ్యారు. రెండు వేల మెజారిటీతో విజయం సాధించిన రోజా... తనది ఐరన్ లెగ్ కాదని గోల్డెన్ లెగ్ అని వ్యాఖ్యానించారు. కరెక్టుగా చెప్పాలంటే ఆమె మెజారిటీ 2681 ఓట్లు.గెలుపు అనంతరం ఆమె విజయదరహాసంతో అందరినీ విష్ చేశారు. అక్కడే ఆమె కళ్లలో ఆనంద బాష్పాలురాలాయి. కౌంటింగ్ సెంటర్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు. ..తాను గెలిస్తే జగన్ అధికారంలోకి రారంటూ ప్రచారం చేసిన వారికి ఇదే హెచ్చరిక అంటూ అదే స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. తనది ఐరెన్ లెగ్ కాదని..గోల్డెన్ లెగ్ అంటూ చెబుతూ..బైబై బాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆమె అభిమానులు అక్కడ డప్పులు కొడుతూ నృత్యాలు చేశారు. ఈరోజు లేదా రేపు విజయోత్సవ ర్యాలీ పెట్టుకుందామని అనుకున్నా.. ఆమె అమరావతికి బయలుదేరే అవకాశం కనిపిస్తోంది.