Begin typing your search above and press return to search.

ఏపీలో.. త‌ప్పును త‌ప్పంటే.. అరెస్టేనా?

By:  Tupaki Desk   |   27 March 2017 7:02 AM GMT
ఏపీలో.. త‌ప్పును త‌ప్పంటే.. అరెస్టేనా?
X
ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్లు క‌నిపిస్తోంది. త‌ప్పులు చేసినోళ్ల‌ను త‌ప్పు చేశార‌ని చెప్ప‌టం కూడా త‌ప్పు అన్న‌ట్లుగా ప‌రిస్థితి నెల‌కొంది. అధికార‌ప‌క్షానికి ఇబ్బంది క‌లిగించేదేదీ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ట్లుగా అధికారుల తీరు ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి బాల‌సుబ్ర‌మ‌ణ్యంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు దౌర్జాన్యానికి దిగ‌టంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి.

అధికారిపై దౌర్జాన్యానికి పాల్ప‌డిన నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌తాన్ని గుర్తు చేస్తూ తిరుప‌తి విమానాశ్ర‌యంలో తాను.. ఎంపీ మిథున్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళ‌హ‌స్తి ఇంఛార్జి బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డిపై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని ఆరోపించారు. విమానాశ్ర‌య అధికారిపై తాము దాడి చేసిన‌ట్లుగా ఆరోపించారని.. కానీ అందుకు సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ఏమీ లేకున్నా కేసులు న‌మోదు చేసి జైలుకు త‌ర‌లించిన‌ట్లుగా చెప్పారు. త‌న‌ను 21 రోజులు జైల్లో ఉంచార‌న్నారు.

ఈ రోజున వీడియో ఫుటేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. కేసులు పెట్ట‌లేని వైనంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ చెవిరెడ్డి అసెంబ్లీ ఎదుట నిర‌స‌న చేప‌ట్టారు. చ‌ట్టం అంద‌రికి ఒకేలా ఉండాల‌ని.. త‌ప్పు చేయ‌ని త‌మ‌పై కేసులు పెట్టి.. జైల్లో పెడుతున్నార‌ని.. త‌ప్పు చేసిన‌ట్లుగా చాన‌ళ్ల‌లో వీడియోల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా.. కేసులు న‌మోదు చేయ‌క‌పోవ‌టాన్ని ప్ర‌శ్నించారు. ఆడియో.. వీడియో సాక్ష్యాలుతో దొరికిపోయిన టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి నిర‌స‌న‌ ఆందోళ‌న‌ను అడ్డుకున్న పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకొని.. అక్క‌డి నుంచి స‌మీప పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించ‌టం గ‌మ‌నార్హం. త‌ప్పు చేసి వారు.. సింఫుల్ గా సారీ చెప్పేస్తే స‌రిపోవ‌టం.. త‌ప్పు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోరా? అంటూ ఆందోళ‌న చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌టం చూస్తే.. త‌ప్పును త‌ప్పు అని చెప్ప‌టం కూడా త‌ప్పేనా? అన్న సందేహం రాక మాన‌దు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/