Begin typing your search above and press return to search.

బాబు మాట‌!.. నేనే బెస్ట్, అంతా వేస్ట్‌!

By:  Tupaki Desk   |   22 Sep 2017 5:26 AM GMT
బాబు మాట‌!.. నేనే బెస్ట్, అంతా వేస్ట్‌!
X
వినేవాడు ఉండాలే కానీ.. చంద్ర‌బాబు ఎన్నైనా చెబుతారు. ఏమైనా చెబుతారు! అన్నారు మొన్నామ‌ధ్య అనంతపురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి. ఆయ‌న ఏ కంటెస్ట్‌లో చెప్పారో క్లారిటీ లేదుకానీ, ఇప్పుడు మాత్రం క్లారిటీ వ‌చ్చింది అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు! రెండు రోజులు విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు పెట్టారు చంద్ర‌బాబు దీనికి గాను ప్ర‌జ‌ల సొమ్ము దాదాపు ప‌ది కోట్ల వ‌ర‌కు ధార పోశార‌ని అంటున్నారు. ఒక్కొక్క భోజ‌నం ఖ‌రీదే 3000 పై చిలుకు ఉంద‌ని విష‌యాలు లీక‌య్యాయి. ఇక‌, ఐఏఎస్‌ ల‌కు రూముల ఏర్పాటు, వారి ప్ర‌యాణ ఖ‌ర్చు, వారి అసిస్టెంట్లు - జేసీలు ఇలా ఒక‌టేమిటి.. అన్ని విధాలా ఖ‌జానాపై ప‌ది కోట్ల భారం ఖ‌చ్చితంగా ప‌డింద‌ని చెబుతున్నారు.

బాగానే ఉంది. ఇంత‌లా ఈ రెండు రోజులు కాన్ఫ‌రెన్స్ పెట్టి బాబు సాధించిందేంటి? ప‌్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏంటి? అని ప్ర‌శ్నిస్తే.. మాత్రం శూన్యం క‌నిపిస్తోంది అంటున్నారు విశ్లేష‌కులు. బాబు త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకోవ‌డం కోసం.. దీనిని వాడేసుకున్నార‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎవ‌రూ ప‌నిచేయ‌డం లేద‌ని, తాను మాత్ర‌మే చేస్తున్నాన‌ని డ‌ప్పుకొట్టుకునేందుకు బాబు ఈ కాన్ఫ‌రెన్స్‌ ను వాడుకున్నార‌ని వారు చెబుతున్నారు. ఇక‌, ఇదే విష‌యంపై వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కూడా మాట్లాడారు.

చంద్రబాబు పాలనలో కలెక్టర్లు కనీసం రేషన్‌ కార్డులు - పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని కొరుముట్ల విమ‌ర్శించారు. టీడీపీ నేతలు చెప్పినట్టు వినాలని ఐఏఎస్‌ - ఐపీఎస్‌ అధికారులను బాబే స్వ‌యంగా ఆదేశించారని ఆరోపించారు. ఏపీలో పనిచేయలేక అధికారులు కేంద్ర సర్వీసులకు వెళుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వివిధ శాఖ‌ల ప‌నితీరు స‌మీక్షిస్తూ.. తాను మాత్ర‌మే ప‌నిచేస్తున్నాన‌ని మీరు ఎందుకు చేయ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నించ‌డం బాబు వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తోంద‌ని చెబుత‌న్నారు. తాను చేస్తున్న పాపాల‌కు బాబు.. సంబంధిత అధికారుల‌ను బ‌లి చేస్తున్నార‌ని శ్రీనివాస్ చెప్పారు.

అంటే ప్ర‌జ‌ల్లో బాబు బెస్ట్‌ గా ఉండాలి. అధికారులు మాత్రం వేస్ట్‌ గా ఉండాల‌ని బాబు కోరుకుంటున్న‌ట్టుగా ఉంద‌న్నారు. అధికారుల‌కు తెల్లారిలేస్తే.. ఏం చేయాలో ఏం చేయ‌కూడ‌దో అన్నీ వివ‌రించే చంద్ర‌బాబు వ‌ల్లే సీనియ‌ర్ ఐఏఎస్‌ లు కూడా నేడు రాష్ట్రంలో డ‌మ్మీలుగా మారార‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యాన్ని ఐఏఎస్‌ లు ఆఫ్‌ ది రికార్డుగా మీడియా ముందు కూడా చెబుతున్నార‌ని అన్నారు. గార‌డీ బాబు తో వారు విసిగిపోతున్నార‌ని కొరుముట్ల చెప్పారు. బాబు త‌న వైఖ‌రి మార‌క‌పోతే.. భ‌విష్య‌త్తులో చాలా న‌ష్ట‌పోతాడ‌ని అన్నారు.