Begin typing your search above and press return to search.

మంత్రి ప‌త్తిపాటి గుట్టు విప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   23 March 2017 10:15 AM GMT
మంత్రి ప‌త్తిపాటి గుట్టు విప్పిన జ‌గ‌న్‌
X
గ‌డిచిన కొద్ది కాలంగా త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై ఏపీ ప్ర‌భుత్వం స్పందించాలంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. ఆందోళ‌న‌లు.. ధ‌ర్నాలు చేస్తున్నా స్పందించ‌ని ఏపీ అధికార‌ప‌క్షం.. ఈ రోజు విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పుణ్య‌మా అని రియాక్ట్ కాక త‌ప్ప‌లేదు. అగ్రిగోల్డ్ బాధితుల విష‌యంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో.. అగ్రిగోల్డ్ బాధితుల వ్య‌వ‌హారం ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా బాధితులపై చ‌ర్చ జ‌రిగిన అనంత‌రం.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేస్తూ.. అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని.. బాధితులు కోరితే ఈ వ్య‌వ‌హారాన్ని సీబీఐ ద‌ర్యాప్తు చేయ‌టానికి సైతం త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఓప‌క్క త‌మ‌కు న్యాయం చేయ‌మ‌ని వేలాది మంది బాధితులు మొత్తుకుంటే.. వారికి న్యాయం చేసే చ‌ర్య‌ల మీద కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌కుండా.. వారు కోరుకుంటే.. త‌మ ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తుంద‌న్న వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. బాబు ప్ర‌క‌ట‌న త‌ర్వాత మాట్లాడిన విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌.. అగ్రిగోల్డ్ బాధితుల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు మాన‌వత్వంతో వ్య‌వ‌హ‌రిస్తార‌ని తాను భావించామ‌ని.. కానీ.. ఆయ‌న త‌న‌లో క‌నీస మాన‌వ‌త్వం చూప‌లేద‌ని మండిప‌డ్డారు. రూ.1,182 కోట్లు మొత్తాన్ని ఇస్తే దాదాపు 13.83 ల‌క్ష‌ల మందికి న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. త‌మ వ‌ద్ద‌నున్న స‌మాచారం ప్ర‌కారం ఆగ్రిగోల్డ్ ఆస్తుల వివ‌రాల్ని వెల్ల‌డించిన జ‌గ‌న్‌.. ఆస్తుల విలువ దాదాపు ఏడు వేల కోట్ల‌కు పైగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట‌ర్ల వివ‌రాల‌తో పాటు.. బాధితుల వివ‌రాల్ని కూడా ఆన్‌ లైన్లో పెట్టాల‌న్నారు. అరెస్ట్ ల విష‌యంలో ప‌క్ష‌పాతం చూపార‌న్న జ‌గ‌న్‌.. అగ్రిగోల్డ్ ఛైర్మ‌న్‌ తో పాటు ఆయ‌న సోద‌రుడ్ని అరెస్ట్ చేసి.. మిగిలిన వారి జోలికి వెళ్ల‌లేద‌న్నారు.

డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన సీతారాం ఉన్నార‌ని.. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌లేద‌న్న జ‌గ‌న్‌.. సీఐడీ విచార‌ణ మొద‌ల‌య్యాక అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొంత‌మంది కొనుగోలు చేసి రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటున్నార‌ని.. అందులో ప‌త్తిపాటి పుల్లారావుస‌తీమ‌ణి ఉన్న‌ట్లుగా జ‌గ‌న్ ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా రియాక్ట్ అయిన ప‌త్తిపాటి తాము కొన్న స్థ‌లం అగ్రిగోల్డ్‌కు చెందింది కాద‌న్నారు. ఒక‌వేళ తాను కొన్న‌ది అగ్రిగోల్డ్ భూములు కొన్న‌ట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాలు విసిరారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ.. తాను రుణ‌మాఫీ అంశం మాట్లాడితే అగ్రిగోల్డ్ అంశం ప‌క్క‌దారి పడుతుంద‌ని.. అందుకే తాను ఆ ఇష్యూ జోలికి వెళ్ల‌టం లేద‌న్నారు.అగ్రిగోల్డ్ పై కేసులు న‌మోదు అయ్యాక‌.. త‌క్కువ ధ‌ర‌కు భూములు కొన్న‌ట్లు వ్య‌వ‌సాయ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావే స్వ‌యంగా చెప్పార‌న్నారు. అగ్రిగోల్డ్ డైరెక్ట‌ర్ సీతారాం తిరుప‌తిలోని ఒక హోట‌ల్‌ను రూ.14కోట్ల‌కు అమ్మార‌ని.. ఆయ‌న భార్య పుష్ప‌ల‌త 31 ఎక‌రాలు.. కుమార్తె ఎనిమిది ఎక‌రాల భూమిని అమ్మిన‌ట్లుగా చెప్పారు. మంత్రి కొన్న భూములు అగ్రిగోల్డ్‌ కు చెందిన హాయ్ లాండ్ సీఈవో.. డైరెక్ట‌ర్ అని.. అయితే.. ఆయ‌న‌కు అగ్రిగోల్డ్ సంస్థ‌కు సంబంధం లేద‌ని చెబుతున్నార‌ని.. ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో విచార‌ణ జ‌రిపితే.. అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. ప‌త్తిపాటి పుల్లారావుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చ‌ర్చ‌కు.. గంద‌ర‌గోళానికి దారి తీసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/