Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సాయం ప్రాణాన్ని నిలబెట్టింది..కోలుకుంటున్న నీర‌జ్

By:  Tupaki Desk   |   22 Jun 2019 6:46 AM GMT
జ‌గ‌న్ సాయం ప్రాణాన్ని నిలబెట్టింది..కోలుకుంటున్న నీర‌జ్
X
ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత విశాఖ శార‌దా పీఠానికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కొంద‌రు సేవ్ ఆవ‌ర్ ఫ్రెండ్ అంటూ బ్యాన‌ర్ పెట్టుకొని నిల‌బ‌డ‌టం జ‌గ‌న్ దృష్టిని ఆక‌ర్షించింది. కాన్వాయ్ నుంచి ఆయ‌న నేరుగా వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వివ‌రాలు తెలుసుకున్నారు

త‌మ కుమారుడు నీర‌జ్ కుమార్ ప్రాణాంత‌క వ్యాధి బారిన ప‌డ్డాడ‌ని.. అత‌డి జ‌బ్బు న‌యం కావాలంటే రూ.25 ల‌క్ష‌లు అవుతుంద‌ని వైద్యులు చెబుతున్నార‌ని.. రోజువారీగా కూలీ చేసుకునే త‌మ‌కు అంత మొత్తం స‌మ‌కూర్చుకోలేక‌పోతున్న‌ట్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏడాది నుంచి ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని గ‌డిపామ‌న్నారు. నీర‌జ్ త‌ల్లిదండ్రుల‌తో పాటు అత‌డి స్నేహితులు కూడా అక్క‌డే ఉన్నారు.

దీంతో స్పందించిన జ‌గ‌న్‌.. ఎంత ఖ‌ర్చు అయినా ఫ‌ర్లేద‌ని.. త‌ప్ప‌నిస‌రిగా కాపాడుకుండామ‌న్నారు. నీర‌జ్ వైద్యానికి అయ్యే ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. త‌క్ష‌ణ‌మే వైద్య‌సేవ‌లు అందించాల‌ని అధికారుల్ని ఆదేశించారు. అప్ప‌టిక‌ప్పుడు వైద్యం కోసం రూ.10 ల‌క్ష‌లు ప్ర‌భుత్వం నుంచి చెల్లించారు.

అంతేకాదు.. వైద్యానికి అయ్యే ఖ‌ర్చు ఎంతైనా ఫ‌ర్లేద‌ని.. ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని సీఎంవో అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న నీర‌జ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అత‌నికి ప్ర‌స్తుతం కీమోథెర‌పీ చేస్తున్నారు. గుండెకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌లో త‌లెత్తిన స‌మ‌స్య‌ను వైద్యులు స‌రి చేశారు. దీంతో ఆక్సిజ‌న్ అవ‌స‌రం లేకుండా వైద్యులు వైద్యాన్ని అందిస్తున్నారు.

గ‌తంలో మాదిరి కాకుండా గొట్టం నుంచి కాకుండా ఇప్పుడు నేరుగా నోటి నుంచి ఆహారాన్ని తీసుకుంటున్న‌ట్లు నీర‌జ్ త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక‌సారి మాట ఇస్తే చాలు మాట నిల‌బెట్టుకోవ‌టం ఎలానో జ‌గ‌న్ ను చూసి నేర్చుకోవాల‌న్న మాట నీర‌జ్ త‌ల్లిదండ్రులు.. అత‌ని స్నేహితుల నోట వినిపిస్తుండటం గ‌మ‌నార్హం.