పవన్ పొగడ్తలతో జగన్ ఫ్యాన్స్ ఖుషీ!

Mon Feb 19 2018 23:46:00 GMT+0530 (IST)

‘‘జగన్ గారు అంటే దమ్ము ధైర్యం తెగువ ఉన్న నాయకుడు.. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన చాలా ధైర్యంగా ముందుకు పోతూనే ఉంటారు’’ ఇవి జగన్ గురించి ఏ విజయమ్మ గానీ షర్మిల గానీ.. ఆయన అనుంగు అనుచరులు గానీ చెప్పిన మాటలు కాదు. అక్షరాలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విపక్షనేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నిర్వచనం. ఆ పోరాట పటిమతోనే ఆయన ఎలాంటి భయం లేకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మీద కూడా అవిశ్వాసం పెట్టాలనేది పవన్ అంతరంగం. తనను ‘మనోడే’ అని చెప్పుకుంటున్న  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విషయంలో కూడా పవన్ ఎన్నడూ ఇంత సూటిగా పొగడలేదేమో.. కానీ జగన్ దమ్మూ ధైర్యం తెగువ గురించి ఆయన ఇచ్చిన కితాబులు చూసి జగన్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు.తాను అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమే గానీ.. దానికి అవసరమైన మద్దతును పవన్ కూడగడతారా? అంటూ జగన్ ప్రశ్నించిన సంగతి అందరికీ తెలుసు. ఈ ప్రతిపాదనను సవాలు కింద స్వీకరించిన పవన్ కల్యాణ్ 80 మంది మద్దతును కూడగట్టగలనంటూ ప్రకటించి.. జగన్ వ్యక్తిత్వ లక్షణాలను పైన చెప్పిన విధంగా అభినందించారు.

ఈ పొగడ్తలు మాత్రం జగన్ అభిమానులకు పండగగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ గొప్ప నిజాన్ని ఒప్పుకున్నాడని వారు అనుకుంటున్నారు. తమ నేత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి కావడం అక్షరాలా నిజం అని.. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన దగ్గరినుంచి సోనియాగాంధీ తనను చిన్నచూపు చూసినప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నా కేసులు పెట్టి అరెస్టు చేయించి జైల్లో పెట్టినా బయటకు వచ్చిన తర్వాత.. కేసుల విచారణ పేరుతో ఎడాపెడా వేధిస్తూ ఎన్నిరకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నా.. ఆయనలోని దమ్మూ ధైర్యం ఎన్నడూ సడలిపోలేదని జగన్ అభిమానులు అనుకుంటున్నారు. అంత దమ్మున్న నేత గనుకనే.. ప్రత్యేకహోదా డిమాండ్ తో తమ ఎంపీలందరూ రాజీనామాలు కూడా చేసేస్తారంటూ డెడ్ లైన్ తేదీ సహా ప్రకటించారని అంటున్నారు. అంత తెగువ ఉన్న నేత గనుకనే.. పవన్ ప్రతిపాదన చేసిన వెంటనే.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని

అదే చంద్రబాబునాయుడు ఇప్పటికీ.. కనీసం ‘మనోడే’ అని చెప్పుకునే పవన్ ప్రతిపాదనను కనీసం సవ్యంగా పట్టించుకుని ఆదరించలేదని అది ఆయన వైఖరికి నిదర్శనం అనే విమర్శలు కూడా వస్తున్నాయి.