Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ రోజాను ఇలా చూసి ఉండ‌రు

By:  Tupaki Desk   |   16 Jan 2018 5:21 AM GMT
ఫైర్ బ్రాండ్ రోజాను ఇలా చూసి ఉండ‌రు
X
తూటాల్లా పేలే మాట‌ల‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత ఆర్కే రోజా. ఆమె మాట్లాడ‌టం మొద‌లు పెడితే.. ఎదుటోడికి స‌మాధానం కోసం మాట‌లు వెతుక్కోవాల్సిందే. దూకుడుగా ఉండే మాట‌లే కాదు.. మొండిత‌నం పాళ్లు రోజాలో ఎక్కువే.

ఫైర్ బ్రాండ్ రోజా ఇమేజ్ కు భిన్నంగా టీవీ షోల‌లో.. సినిమాల్లోనూ ఆమె క‌నిపిస్తారు. ఇలా రెండు కోణాలు తెలిసిన వారికి.. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబందించిన ఆస‌క్తిక‌ర వీడియోను తాజాగా పోస్ట్ చేశారు ఆర్కే రోజా. ప్ర‌జాప్ర‌తినిదిగా.. సెల‌బ్రిటీగా బిజీ బిజీగా ఉండే రోజా.. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యులతో పండ‌గ‌ను ఎంత స‌ర‌దాగా చేసుకున్నారో చెప్పే వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇంటి మిద్దె మీద పిల్ల‌ల‌తో క‌లిసి రోజా పతంగుల్ని ఎగుర‌వేశారు. అంతేకాదు.. కొడుక్కి.. పతంగిని ఎలా ఎగుర‌వేయాలో చూపించ‌ట‌మే కాదు.. అల్లంతు ఎత్తున ఎగిరేలా చేసి.. ఆ ప‌తంగిని మ‌రింత ఎత్తుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్న వైనం వీడియోల ఉంది. ఇప్ప‌టికే ప‌లు కోణాల్లో అంద‌రికి తెలిసిన రోజా.. ప‌తంగులు ఎగుర‌వేయ‌టంలో త‌న‌కున్న స‌త్తాను తాజా వీడియోతో చెప్ప‌టమే కాదు.. ప్ర‌జాజీవితంలో ఉన్నా కుటుంబానికి తానిచ్చే ప్రాధాన్య‌త‌ను పొట్టి వీడియోతో చెప్పేశార‌ని చెప్పాలి.