Begin typing your search above and press return to search.

మోడీతో భేటీకి 2 రోజుల ముందు చైనా కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Oct 2019 9:47 AM GMT
మోడీతో భేటీకి 2 రోజుల ముందు చైనా కీలక వ్యాఖ్యలు
X
మరో రెండు రోజుల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. రెండు రోజులు పాటు భారత్ లో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో చైనా అధ్యక్షుడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీకి అనూహ్యంగా తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం వేదిక కానుండటం విశేషం. డ్రాగన్ దేశాధినేతతో భేటీకి మహాబలిపురాన్ని ఎంపిక చేయటం ఒక విశేషమైతే.. ఈ ఆసక్తికర మీటింగ్ జరగటానికి రెండు రోజుల ముందు కశ్మీర్ అంశంపై చైనా కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

కశ్మీర్ అంశాన్ని భారత్ - పాక్ దేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని కోరింది. కశ్మీర్ విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని.. రెండు దేశాలు కలిసి కశ్మీర్ సహా అన్ని సమస్యల్ని కూలంకూషంగా చర్చించుకోవాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యల్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడారు.

ఇరు దేశాల మధ్య విశ్వాసంతో చర్చలు జరిగితే.. దాయాది దేశాలకు ప్రయోజనం కలుగుతుందని.. ప్రపంచ దేశాల ఉద్దేశం కూడా ఇదేనని చెప్పటం గమనార్హం. భారత ప్రధాని మోడీతో తమ దేశాధినేత భేటీకి రెండు రోజుల ముందు చైనా ప్రతినిధి కశ్మీర్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. మహాబలిపురంలో జరిగే మీటింగ్ ఎలా సాగుతుందో చూడాలి.