Begin typing your search above and press return to search.

ప్రపంచ భారీకాయురాలు.. ఎమాన్‌ కన్నుమూత

By:  Tupaki Desk   |   25 Sep 2017 12:29 PM GMT
ప్రపంచ భారీకాయురాలు.. ఎమాన్‌ కన్నుమూత
X
ప్ర‌పంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్ ఇక లేరు. ఇంత‌కీ ఎమాన్ గుర్తుకు వ‌చ్చారా? ఈజిఫ్ట్ కు చెందిన ఆమె అత్యంత బ‌రువుతో శ్వాస తీసుకోవ‌టం కూడా క‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆమె బ‌రువును త‌గ్గించే బాధ్య‌త‌ను ముంబ‌యిలోని సైఫీ ఆసుప‌త్రికి తీసుకొచ్చారు.

36 ఏళ్ల ఏమాన్‌ ను ముంబ‌యికి తీసుకొచ్చిన‌ప్పుడు 504 కేజీలు ఉండేవారు. కొద్దికాలం పాటు చికిత్స చేసిన అనంత‌రం ఆమె బ‌రువు 242 కేజీల‌కు త‌గ్గించిన‌ట్లుగా వైద్యులు చెప్పారు. అయితే.. ముంబ‌యి వైద్యులు వైద్య‌సేవ‌ల‌పై ఎమాన్ సోద‌రి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆమెకు వైద్యం చేసిన వైద్యుల‌పై ఆరోప‌ణ‌లు చేశారు.

త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన స‌మ‌యం కంటే ఎమాన్ ఆరోగ్య ప‌రిస్థితి బాగా మెరుగైంద‌ని.. మ‌రికొంత‌కాలం ఆమెకు వైద్య సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పినా.. ఎమాన్ సోద‌రి ఒప్పుకోలేదు. చివ‌ర‌కు ఆమెను ముంబ‌యి నుంచి అబుదాబిలోని బుర్జీల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమెకు వైద్య సేవ‌లు అందిస్తుండ‌గా ఈ రోజు (సోమ‌వారం) ఆమె తుదిశ్వాస విడిచారు. కిడ్నీ.. గుండె సంబంధిత వ్యాధుల కార‌ణంగా ఆమె మ‌ర‌ణించిన‌ట్లుగా ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ముంబ‌యి నుంచి ఎమాన్‌ ను త‌ర‌లించే స‌మ‌యానికి ఆమె కోలుకోవ‌ట‌మే కాదు.. త‌నంత‌ట తాను తిన‌గ‌లిగే ప‌రిస్థితికి వ‌చ్చిన‌ట్లుగా అప్ప‌ట్లో వైద్యులు చెప్పారు. అబుదాబికి చేరిన త‌ర్వాత ఆమె కోలుకున్న‌ట్లు వైద్యులు చెప్పినా.. ఆమె మ‌ర‌ణించ‌టం గ‌మ‌నార్హం. ఎమాన్ క‌న్నుమూత‌తో ప్ర‌పంచంలోనే అత్యంత భారీకాయురాలు ఇక లేన‌ట్లే.