Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం క్రాష్ ల్యాండ్!

By:  Tupaki Desk   |   25 Aug 2016 9:05 AM GMT
ప్రపంచంలోనే అతి పెద్ద విమానం క్రాష్ ల్యాండ్!
X
ప్రపంచంలోనే అది పెద్ద విమానమైన ఎయిర్ ల్యాండర్ 10ను బ్రిటన్‌ లో రెండోసారి ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. అయితే ముందుగా పైకి బాగానే ఎగిరిన ఈ విమాననానికి, కిందికి దిగేటప్పుడు మాత్రం ఇబ్బంది ఎదురైంది. సుమారు ఎనిమిది అంతస్థుల ఎత్తైన ఈ విమానం టెలీఫోన్ పోల్‌ ను ఢీకొనడంతో కాక్ పిట్ డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ క్రాష్ ల్యాండ్ లో ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదని, పైలెట్లు సురక్షితంగా ఉన్నారని ఈ భారీ విమానాన్ని తయారుచేసిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ వెల్లడించింది.

ఈ విమానం ఈ నెల 17న నిర్వహించిన తొలి పరీక్షలో విజయవంతంగా ఎగిరింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో 16 వేల అడుగుల ఎత్తులో ఎగరగలిగే ఈ విమానం ఏకంగా రెండు వారాల పాటు గాల్లోనే తేలియాడగలదు. తక్కువ ఇంధనంతో ఎక్కువ సామాగ్రిని రవాణా చేసేవిధంగా అమెరికా మిలిటరీ అవసరాల కోసం సుమారు 40 మిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. కొంత విమానం, కొంత ఎయిర్ షిప్ అయిన ఈ ఎయిర్ ల్యాండర్-10 విమానం బుధవారం సెంట్రల్ ఇంగ్లాడ్ లోని కార్డింగ్టన్ ప్రాంతంలోలో రెండోసారి ఆకాశంలోకి ఎగిరింది.

కాగా.. ఇదే ఎయిర్ ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్ షిప్ ఆర్-101 విమానం 1930 అక్టోబర్ నెలలో ఫ్రాన్స్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మరణించారు. దీంతో ఇక బ్రిటన్ లో ఎయిర్ షిప్ లు తయారు చెయ్యడాన్ని నిలిపేశారు. అయితే అమెరికా ఆర్మీ అవసరాల కోసం బ్రిటన్ కు చెందిన హైబ్రిడ్ వెహికిల్స్ సంస్థ తాజాగా 302 అడుగుల పొడవున్న ఈ ఎయిర్ ల్యాండర్ -10ను రూపొందించింది.