Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యంలో అతివలే లేరా?

By:  Tupaki Desk   |   28 July 2016 7:30 PM GMT
అగ్రరాజ్యంలో అతివలే లేరా?
X
అగ్రరాజ్యం అమెరికా అంటే అభివృద్ధికి చిరునామా.. ప్రపంచ దేశాల ప్రజలకు కలల తీరం. అక్కడ నివసించాలని.. అక్కడ చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలని అంతా కోరుకుంటారు. అలాంటి అభివృద్ధి చెందిన అమెరికాకు ఇంతవరకు ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేరు. ఇప్పటికి 44 మంది అధ్యక్షులు పనిచేస్తే అందరూ మగవాళ్లే. అభివృద్ధి చెందామని చెప్పుకొంటున్న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ వరకు వచ్చింది కూడా అతి కొద్ది మందే. అది కూడా అమెరికాలోనే అందరికీ తెలియని పార్టీల వారే. ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్ - రిపబ్లికన్ పార్టీల నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా మహిళా అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు తొలిసారిగా ప్రధాన పార్టీ డెమొక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడం ప్రాముఖ్యం సంతరించుకుంది.

అయితే... నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో మహిళ కూడా పోటీ పడుతున్నారు. గ్రీన్ పార్టీ అనే చిన్న రాజకీయ పక్షం నుంచి జిల్ స్టెయిన్ అనే మహిళ పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆమె పోటీ చేశారు.

కాగా 1940లో తొలిసారిగా గ్రేసీ అలెన్ సర్ ప్రైజ్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తరువాత 1972 వరకు ఎవరూ లేరు. ప్రస్తుతం గ్రీన్ పార్టీ నుంచి బరిలో ఉన్న జిల్ స్టెయిన్... ఇంతకుముందు 1988 - 92ల్లో పోటీ చేసిన లెనోరా ఫులానీ మాత్రమే రెండేసి సార్లు బరిలో నిలిచారు. హిల్లరీ క్లింటన్ 2008లో ప్రయత్నించినా నామినేట్ కాలేకపోయారు.

ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మహిళలు వీరే..

- 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్(డెమొక్రటిక్ పార్టీ) - జిల్ స్టెయిన్(గ్రీన్ పార్టీ)

- 2012లో జిల్ స్టెయిన్( గ్రీన్ పార్టీ)

- 2012లో రోసన్నా బార్(పీస్ అండ్ ఫ్రీడమ్ పార్టీ)

- 2008లో సింథియా మెక్ కెన్నీ(గ్రీన్ పార్టీ)

- 1996లో మోనికా మూర్హెడ్(వర్కర్సు వరల్డ్ పార్టీ)

- 19996లోనే మార్షా ఫీన్లాండ్(పీస్ అండ్ ఫ్రీడం పార్టీ)

- 1992లో లెనోరా ఫులానీ(న్యూ అలయన్సు పార్టీ)

- 1988లో లెనారా ఫులానీ(న్యూ అలయన్స్ పార్టీ)

- 1984లో సోనియా జాన్సన్(సిటిజన్స్ పార్టీ)

- 1980లో ఎలెన్ మెక్ కార్మెక్(రైట్ టు లైఫ్ పార్టీ)

- 1980లో మౌరీన్ స్మిత్(పీస్ అండ్ ఫ్రీడం పార్టీ)

- 1980లో డియార్డీ గ్రిస్ వోల్డ్(వర్కర్సు వరల్డ్ పార్టీ)

- 1976లో మార్గరెట్ రైట్(పీపుల్సు పార్టీ)

- 1972లో ఎవలీన్ రీడ్(సోషలిస్టు వర్కర్సు పార్టీ)

- 1972లో లిండా జెన్నెస్(సోషలిస్టు వర్కర్సు పార్టీ)

- 1940లో గ్రేసీ అలెన్(సర్ ప్రైజ్ పార్టీ)

--- గరుడ