బెజవాడ స్టార్ హోటల్ కు పాకిన దరిద్రం!

Thu Jul 19 2018 11:16:39 GMT+0530 (IST)

కాస్మో కల్చర్ దిశగా అడుగులు వేయాలనుకునే నగరాలు.. వసతుల విషయంలో కంటే.. ఆయా కాస్మో నగరాల్లో కనిపించే దరిద్రాల్ని మాత్రం త్వరగా అందిపుచ్చుకోవటం కనిపిస్తోంది. పెద్ద పట్టణాల స్థాయి నుంచి నగరాలుగా మారుతున్న వేళ.. కొత్త కొత్త కల్చర్లను పరిచయం చేసేప్రయత్నం జరగటం.. అందులో భాగంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పెద్దపీట వేయటం ఎక్కువ అవుతోంది.తాజాగా అలాంటి పనే చేసిన ఒక హోటల్ తీరు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఫుల్ గా మందు కొట్టి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న కొందరిని తాజాగా బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలోని ప్రముఖ హోటల్ గా పేరున్న ఈ హోటల్లో తాజాగా అధికారులు దాడులు నిర్వహించారు. భవానీపురంలోని అలీవ్ ట్రీ హోటల్లో అశ్లీల నృత్యాల జోరు భారీగా సాగుతుందన్న సమాచారం పోలీసులకు అందింది.

వెంటనే వెళ్లిన వారికి.. మందు తాగుతూ అమ్మాయిలతోకలిసి అశ్లీల నృత్యాలు చేస్తూ.. చిందులు వేస్తున్న 53 మంది దొరికిపోయారు. వారిపై సెక్షన్ 354 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులకు దొరికిన వారిలో పలువురు ప్రముఖులు.. బడా వ్యాపారాలు చేసే వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక.. అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళల విషయానికి వస్తే వారిలో హైదరాబాద్‌కు చెందిన ఒకరు.. విజయవాడకు చెందిన మరొకరుతో పాటు భీమవరానికి చెందిన నలుగురు మహిళలు ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.  ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అతన్ని ముందస్తు జాగ్రత్తగా తప్పించిన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీల సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం.. కండోమ్ ప్యాకెట్లు దొరకటం గమనార్హం.