Begin typing your search above and press return to search.

నదినీళ్లతో నార్మల్ డెలివరీ అట..

By:  Tupaki Desk   |   20 July 2019 12:00 PM GMT
నదినీళ్లతో నార్మల్ డెలివరీ అట..
X
ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఈ కాలంలో సాధారణ ప్రసవం అనేది కల్ల. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్న జిల్లాల్లో కరీంనగర్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కాన్పు అంటే చాలు కడుపు కోసేస్తున్నారని కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ కూడా నివేదికలో చెప్పి సీరియస్ గా ఆస్పత్రులకు వార్నింగ్ ఇచ్చింది.

అయినా ఈ కాలంలో సాధారణ ప్రసవం అనేది కలలో కూడా ఊహించని విషయం. అయితే సిజేరియన్ ఆపరేషన్ల వల్ల తల్లి, బిడ్డా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. మరి సాధారణ ప్రసవాలు జరగాలంటే ఏం చేయాలి..? అస్తమానం ఈ ప్రశ్నకు మీరు బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. మన బీజేపీ ఎంపీ గారు సెలవిచ్చిన ఈ నది నీళ్లు తాగితే ఇట్టే సాధారణ కాన్పు అయిపోతుందట.. పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పిన విషయం విని ఇప్పుడు ఎంపీలు, యావత్ దేశం కూడా నివ్వెరపోయింది.

తాజాగా లోక్ సభలో హోమియోపతికి సంబంధించిన సెంట్రల్ కౌన్సిల్ అమెండ్ మెంట్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు , బీజేపీ ఎంపీ అజయ్ భట్ పాల్గొని ఆసక్తికర విషయం చెప్పారు. గర్భిణులందరూ సిజేరియన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీ కావాలంటే గరుడ గంగానదిలోని నీళ్లను తాగాలంటూ సలహా ఇచ్చాడు. ఈ నది ఉత్తరాఖండ్ లోని భాగేశ్వర్ జిల్లాలోని కుమావ్ లో ఉందని అడ్రస్ చెప్పాడు. ఈ గరుడ గంగానదికి ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. చాలా మందికి ఇది తెలియదని వివరించారు. పాము కరిచినా ఈ నీళ్లు తాగితే బతికారని ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఈ నది నీళ్లలో దొరికే రాళ్లను కరిగించి నీటితో కలిపితే తాగితే సాధారణ ప్రసవం ఖచ్చితంగా అవుతుందని తెలిపాడు.

పార్లమెంట్ సాక్షిగా ఈ ఎంపీ చెప్పిన విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ వాదనను చాలా మంది డాక్టర్లు కొట్టిపారేస్తున్నారు. నదిలో నీళ్లు తాగితే సాధారణ ప్రసవాలు అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ మూర్ఖత్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.