కారులో జంట శృంగారం..జైలుకు పంపిన మహిళ!

Sat Apr 07 2018 12:52:07 GMT+0530 (IST)


ప్రస్తుతం యువతలో విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయన్న దానికి నిదర్శనంగా గుర్గావ్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. విచ్చలవిడిగా లభించిన స్వేచ్ఛను వారు దుర్వినియోగపరుస్తూ పెడదారులు పడుతున్నారు. చిత్తుగా మందుకొట్టడమే కాకుండా బహిరంగా ప్రదేశాల్లో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారు. ఊటుగా తాగిన ఇద్దరు యువతీయువకులు....ఓ మహిళ ఇంటి ముందు కారులో రాసక్రీడలు జరిపారు....ఇదేమి పాడుపని అని ప్రశ్నించిన సదరు మహిళను కూడా తమతోపాటు శృంగారంలో పాల్గొనాలని నిస్సిగ్గుగా ఆహ్వానించారు. ఇరుగుపొరుగు వారి సాయంతో ఆ మహిళ ....పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ జంట ఇపుడు కటకటాలపాలయింది.గుర్గావ్ లో నివసించే ఓ యువతి(25) తన బాయ్ ఫ్రెండ్(20)తో కలిసి చిత్తుగా తాగింది. ఆ మత్తులో తన ఇల్లు అనుకొని పొరుగున ఉన్న మరో మహిళ ఇంటి తలుపు తట్టింది. అయితే అది తన ఇల్లు కాదని తెలుసుకొని ఇంటి బయట ఉన్న కారులో మకాం వేసింది. అంతేకాదు ఆ కారులో వారిద్దరూ రాసక్రీడలు మొదలు పెట్టారు. వారు తలుపు కొట్టడంతో బయటకు వచ్చిన మహిళ...తన ఇంటి ముందు ఉన్న కారు నుంచి శబ్దాలు రావడం గమనించింది. ఆ కారు డోర్ తీయాలని ఆ మహిళ కోరింది. కారులో నగ్నంగా ఉన్న ఆ ఇద్దరు డోర్ తీసి....సదరు మహిళను కూడా తమతోపాటు శృంగారంలో పాల్గొనాలని కోరారు. అంతేకాకుండా ఆ యువకుడు....ఆ మహిళ చేయి పట్టుకొని కారులోకి లాగేందుకు యత్నించాడు. ఈ ఘటనతో అవాక్కయిన మహిళ ఇరుగుపొరుగు వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్లిక్ ప్లేసులో శృంగారంలో పాల్గొనడమే కాకుండా న్యూసెన్స్ చేసిన ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు.