బండ బూతులు:గుంటూరు స్టేషన్ లో మహిళ హల్ చల్

Mon Jun 25 2018 16:18:46 GMT+0530 (IST)

గుంటూరు రైల్వే స్టేషన్ లో ఆదివారం రచ్చ చేసిన మహిళ కోసం పోలీసులు వెతుకులాడుతున్నారు. సకాలంలో తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో రైలు మిస్ అయ్యిందన్న కోపంతో సదురు యువతి రైల్వే అధికారిని నోటికొచ్చినట్టు తిట్టి ఒంటికాలిపై లేచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా ఆమెను గుర్తించేందుకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..సిసి ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం గుంటూరు రైల్వేస్టేషన్ లో ఓ మహిళ టికెట్టు కోసం కౌంటర్ లో నిలబడింది.అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె వెళ్లాల్సిన రైలు కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ సదురు ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. బండబూతులు తిట్టింది.  రైల్వే సిబ్బందిపై నోరు పారేసుకుంది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీసును కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారిన నేపథ్యంలో ఆమెను గుర్తించి కేసులు పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు.