వైద్యులకే అంతుచిక్కని అద్భుతమిదీ..

Sat Aug 18 2018 07:00:11 GMT+0530 (IST)

ఆశ్చర్యం.. అద్భుతం.. డాక్టర్లనే షాక్ కు గురిచేసిన వార్త ఇది.. ఇలా జరుగుతుందని కూడా ఊహించలేని సందర్భం ఇదీ.. బ్రిటన్ కు చెందిన ఓ మహిళ (42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో ఇటీవలే ఆస్పత్రికి వెళ్లింది. ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు ఆమె కంటిలోపల ఒక లెన్స్ ఉందనే విషయాన్ని గుర్తించారు. అంతేకాదు అది దాదాపు 28 ఏళ్లుగా కంటిలోపల ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది సంచలనమైంది.  అందువల్లే ఆమెకు కంటి సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. కానీ లెన్స్ కంటిలోపలికి ఎలా వెళ్లింది.? ఇన్నేళ్లు ఎలా ఉందనే దానిపై సదురు మహిళను ప్రశ్నించారు.28 ఏళ్లపాటు లెన్స్ ను కళ్లలో పెట్టుకొని ఆ మహిళ ఎలా గడిపిందనేది ఇప్పుడు వైద్యులకు కూడా అంతుబట్టడం లేదు. ఈ సందర్భంగా తన 14వ ఏట జరిగిన ఓ సంఘటన వల్లే లెన్స్ కంటిలోకి వెళ్లిపోయి ఉంటుందని సదురు మహిళ చెప్పుకొచ్చింది. ‘తాను ఓ రోజు బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. షటిల్ కాక్ వచ్చి నా కంటిని బలంగా తాకింది. దాంతో కంటికి ఉన్న కాంటాక్ట్ లెన్స్ కింద పడిపోయిందనుకున్నా..కానీ ఇప్పుడే తెలిసింది.. ఆ లెన్స్ నా కంటిలోకి వెళ్లిపోయిందని’ అని గతంలో జరిగిన సంఘటనను వివరించింది. అయితే ఆశ్చర్యకరంగా ఇన్నేళ్లలో ఆమెకు ఎలాంటి కంటి సమస్యలు ఎదురుకాకపోవడం చూసి డాక్టర్లు షాక్ కు గురి అవుతున్నారు. ఇదో అద్భుతమంటూ కొనియాడుతున్నారు.