Begin typing your search above and press return to search.

ఆయ‌న ఓకే చెప్పేస్తే చైనాపై బాంబు వేసేస్తారట‌

By:  Tupaki Desk   |   27 July 2017 12:39 PM GMT
ఆయ‌న ఓకే చెప్పేస్తే చైనాపై బాంబు వేసేస్తారట‌
X
ఇరుగుపొరుగు దేశాల విష‌యంలో క‌య్యానికి కాలు దువ్వుతున్న చైనా విష‌యంలో ఊహించ‌ని షాక్ ఎదురైంది. ప‌లు రాజ్యాల విష‌యంలో అసంద‌ర్భంగా వ్య‌వ‌హ‌రించే చైనాకు అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి దిమ్మతిరిగే హెచ్చ‌రిక వ‌చ్చింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే.. వ‌చ్చే వార‌మే చైనాపై అణుదాడి చేస్తాన‌ని అన్నారు యూఎస్ ప‌సిఫిక్ ఫ్లీట్ క‌మాండ‌ర్ ఆడ‌మ్ స్కాట్ స్విఫ్ట్‌. గురువారం ఆస్ట్రేలియా తీరంలో యూఎస్‌-ఆస్ట్రేలియ‌న్ మిలిట‌రీ సంయుక్త మిలిట‌రీ విన్యాసాల త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్ర‌శ్న‌కు స్విఫ్ట్ ఇలా స్పందించారు.

ఒకవేళ ట్రంప్ ఆదేశిస్తే వ‌చ్చే వార‌మే చైనాపై అణుదాడి చేస్తారా అని అడిగితే.. నా స‌మాధానం అవును అని స్విఫ్ట్ స్ప‌ష్టంచేశారు. త‌మ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ ఆదేశాల‌ను మిలిట‌రీ ఎప్పుడూ జ‌వ‌దాట‌బోద‌ని కూడా స్విఫ్ట్ అన్నారు. ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతంలో యూఎస్‌, ఆస్ట్రేలియా నిర్వ‌హించిన ఈ సంయుక్త విన్యాసాల‌ను చైనా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు నిశితంగా ప‌రిశీలించాయి. ఈ సంయుక్త మిలిట‌రీ విన్యాసాల్లో 36 యుద్ధ‌నౌక‌లు పాల్గొన్నాయి. ఇందులో ఓ ఎయిర్ క్రాఫ్ట్ కారియ‌ర్ యూఎస్ ఎస్ రొనాల్డ్ రీగ‌న్‌ తోపాటు 220 ఎయిర్‌ క్రాఫ్ట్‌ - 33 వేల మంది మిలిట‌రీ బ‌ల‌గాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసాల‌ను చైనీస్ ఆర్మీ టైప్ 815 డాంగ్‌డియావో నౌక ఆస్ట్రేలియా ఎక్స్‌ క్లూజివ్ ఎక‌న‌మిక్ జోన్ ప‌రిధిలో ఉండే ప‌రిశీలించ‌డం గ‌మ‌నార్హం.