Begin typing your search above and press return to search.

మ‌గ ఏనుగు రేప్ తో మ‌ర‌ణించిన ఆడ ఏనుగు!

By:  Tupaki Desk   |   16 July 2019 5:18 AM GMT
మ‌గ ఏనుగు రేప్ తో మ‌ర‌ణించిన ఆడ ఏనుగు!
X
ఇప్ప‌టివ‌ర‌కూ విన‌ని ఒక ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మృగాళ్ల దుర్మార్గానికి ప‌లువురు మ‌హిళ‌లు మ‌ర‌ణించ‌టం తెలిసిందే. త‌మ కామంతో మ‌హిళ‌ల ప్రాణాలు తీసే మ‌గాళ్ల‌కు త‌గ్గ‌ట్లే.. తాజాగా ఏపీలోని ఒక మ‌గ ఏనుగు ఒక ఆడ ఏనుగుపై లైంగిక దాడి జ‌ర‌ప‌టం.. ఆ క్ర‌మంలో ఆ ఆడ ఏనుగు మ‌ర‌ణించిన వైనం షాకింగ్ గా మారింది. తొలుత స‌హ‌జ మ‌ర‌ణంగా భావించిన‌ప్ప‌టికీ.. ఆ ఆడ ఏనుగుకు నిర్వ‌హించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ నిజం బ‌య‌ట‌కు వ‌చ్చి అవాక్కు అయ్యేలా చేసింది.

ఇదంతా జ‌రిగింది ఎక్క‌డంటే.. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు మండ‌లం మండిపేట కోటూరు అట‌వీ బీట్ ప‌రిధిలోని చెత్త‌పెంట అట‌వీ ప్రాంతంలో జ‌రిగింది. అక్క‌డి అట‌వీ ప్రాంతంలో ఒక ఆడ ఏనుగు మృత‌దేహాన్ని ప‌శువుల కాప‌రులు గుర్తించారు. అనారోగ్యం కార‌ణంగా రెండురోజుల క్రితం ఆ ఆడ ఏనుగు మ‌ర‌ణించింద‌ని భావించారు.

అనంత‌రం చిత్తూరుజిల్లా ఎఫ్ ఆర్ వో మ‌ద‌న్ ఆ ఏనుగు మృతికి కార‌ణాల్ని ప‌రిశీలించే క్ర‌మంలో.. దానికి పోస్ట్ మార్టం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఊహించ‌ని రీతిలో షాకింగ్ నిజం ఒక‌టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాని ప్ర‌కారం ఆడ ఏనుగుపై ఒక మ‌గ ఏనుగు లైంగిక దాడికి పాల్ప‌డింద‌ని.. ఆ కార‌ణంగానే స‌ద‌రు ఆడ ఏనుగు మ‌ర‌ణించినట్లు గుర్తించారు. పాడు బుద్దులు మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోకి కూడా వ‌చ్చేశాయా?