పోర్న్ సైట్ లో భార్యాభర్తల వాట్సాప్ `ప్రైవేట్` కాల్!

Sun Mar 18 2018 23:00:01 GMT+0530 (IST)

ఈ ఇంటర్నెట్ జమానాలో సోషల్ మీడియాను చాలామంది విస్తృతంగా వాడుతున్నారు. వ్యక్తిగత - వ్యాపార - ఉద్యోగ రీత్యా...వాట్సాప్ - ఫేస్ బుక్ - ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ లను ఉపయోగించుంటున్నారు. వాట్సాప్ లో డేటా ఎన్ క్రిప్ట్ డ్ అని సురక్షితంగా ఉంటుందనే ఉద్దేశంతో వ్యక్తిగత ఫొటోలు - వీడియోలు కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే పటిష్టమైన సెక్యూరిటీ కలిగిన వాట్సాప్ వంటి యాప్ లోని డేటా కూడా సైబర్ దాడులకు గురవుతున్న ఘటనలు పలువురిని కలవరపెడుతున్నాయి. వాట్సాప్ లోని డేటాను హ్యాకర్లు అవలీలగా దోచేచి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా కొత్తగా పెళ్లయిన ఓ జంట వ్యక్తిగతంగా జరిపిన వాట్సాప్ వీడియోకాల్....పోర్న్ సైట్ లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది.ఈ మధ్యనే పెళ్లయిన జంట వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సంభాషించుకుంటున్నారు. ఆ సంభాషణ సందర్భంగా వారిద్దరూ నగ్నంగా మాట్లాడుకున్న దృశ్యాలను కొందరు హ్యాక్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియో కాల్ ను పోర్న్ సైట్ లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకొని ఖంగుతిన్న జంట ....సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వారు విచారణ చేపట్టారు. ఇవేకాకుండా వాట్సాప్ లో వ్యక్తిగత చాట్ - ఆడియో కాల్స్ కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయని సైబర్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచి సురక్షితమైన పద్ధతిలోనే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని అన్ నోన్ సౌర్సెస్ కు పర్మిషన్ ఇవ్వకుండా ఫోన్ లో ఆప్షన్ ను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు. యువత విచ్చలవిడిగా పోర్న్ వీడియోలకు అడిక్ట్ అవడంతో సైట్ లలో ఎప్పటికపుడు కొత్త వీడియోలను పోస్ట్ చేసేందుకు నిర్వాహకులు ఈ తరహా మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపారు.