Begin typing your search above and press return to search.

తెరవేల్పులు ఎవరి వైపు

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:05 PM GMT
తెరవేల్పులు ఎవరి వైపు
X
తెలుగు సినిమా....తెలుగు రాజకీయం. మూడున్నార దశాబ్దాలుగా ఈ రెండు రంగాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినీ రంగానికి చెందిన వారు తెలుగు రాజకీయాలలోకి వచ్చి ప్రజాప్రతినిధలు అవుతున్నారు. కొన్ని పార్టీలకు, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య విడదీయ రాని అనుబంధమే ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు పరిశ్రమ పరిస్దితి "చిత్రం"గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా తెలంగాణ రాజధాని హైదారబాదులోనే ఉండడంతో రాజకీయంగా ఎవరికి మద్దతు పలకాలనే అంశం తేలడం లేదు. ప్రతీసారి ఎన్నికలకు ముందు అధికార పార్టీని - పొగడడం ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం వంటివి సినీ రంగంలోని వారు చేసారు. అంతేకాదు కొందరు హీరోలు - హీరోయిన్లు అయితే అధికార పార్టీకి బ్రాండ్ అంబాసీడర్లుగా ప్రచారమూ చేసారు. తెలంగాణ పాలనపై అప్పుడంత సంత్రుప్తి - ఇష్టం వ్యక్తం చేసిన సినీ రంగంలోని ప్రముఖులు ఎన్నికల సమయంలో మాత్రం కిమ్ అనడంలేదు. దీనికి కారణం సినీ పరిశ్రమ మొత్తం నొప్పింపక తానొవ్వొక అన్నట్లుగానే వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారికి మద్దతు పలికిన హీరో - హీరోయిన్లు ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఎవరి వైపు మాట్లడక పోవడం చర్చనీయంశం అవుతోంది. ఇదీ తెలుగు సినీ పరిశ్రమ అవకాశ వాదమేనని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న పార్టీని "అబ్బో ఈ ప్రభుత్వం గొప్పద" ఆకాశానికి ఎత్తే తెలుగు సినీ పరిశ్రమ ఎన్నికల ముందు వారికి ఎందుకు అనుకూలంగా ప్రచారం చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి సినీ పెద్దల నుంచి వస్తున్న సమాధానం మాత్రం సహేతుకంగా కనబడడం లేదు. రేపు అధికారంలోకి ఎవరు వస్తే వారి పంచన చేరాలనే సినీ పరిశ్రమ అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు - సినీ పండితులు కూడా తప్పు పడుతున్నారు. సినీ పరిశ్రమకు ఉపయోగపడే - అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలని లేదూ పరిశ్రమను అక్కున చేర్చుకుంటామన్న వారికి అనుకూలంగా ఉండాలని సినీ పండితులు చెప్తున్నారు. సినీ యువ హీరో అల్లరి నరేశ్ నటించిన గోపీ (గోడ మీద పిల్లి) లాంటి చర్యలు సినీ పరిశ్రమను దెబ్బ తీస్తాయని అంటున్నారు.