Begin typing your search above and press return to search.

గుక్కెడు నీళ్లు.. ఎంత తేడా..?

By:  Tupaki Desk   |   15 July 2019 2:30 PM GMT
గుక్కెడు నీళ్లు.. ఎంత తేడా..?
X
దేశం ఒకటే.. కానీ పరిస్థితులు వేరు.. ఇక్కడ దాహం.. దాహం.. అక్కడ పోటెత్తిన వరద.. ఎంత తేడా.. భారత దేశాన్ని ఉపఖండం అంటారు. దీనికి అన్ని శీతోష్ణస్థితులు- వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇన్ని వసతులున్నా ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఇది నిజంగా నిజం.

నదుల అనుసంధానం దేశంలో పెద్ద వివాదాస్పద అంశం. గోదావరిని కృష్ణాలో కలిపితే లొల్లి ఎగువరాష్ట్రాలు ఒప్పుకోవు. అయితే నీటి కోసం హహాకారాలు చేస్తున్న జనాన్ని చూస్తే మాత్రం ఆ నీటిని ఒడిసిపట్టాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.

తాజా ఉత్తర భారతం వరదలతో అల్లాడుతోంది. వానాకాలం మొదలు కావడంతో దేశవ్యాప్తంగా పడని వానలు.. చివరన ఉన్న హిమాలయాల చెంతకు వెళ్లి కురుస్తున్నాయి. దీంతో అస్సాం సహా ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా బ్రహ్మపుత్ర వరదలకు ఒక స్కులు భవనాలు కొట్టుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇక దక్షిణాదిన చెన్నై గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది. నీళ్ల యుద్ధాలు జరుగుతున్నాయి. వానలు పడక.. భూగర్భ జలాలు అడుగంటి నీటి కోసం హత్యలు జరుగుతున్నాయి. నీళ్లు బహుఖరీదుగా మారాయి. రైళ్లల్లో ఇక్కడికి నీటిని తరలిస్తున్నారు.

దేశంలోనే అత్యధిక వరదలు వచ్చే నది బ్రహ్మపుత్ర. హిమాలయాల్లో పుట్టే దీనికి వాన నీటి తీవ్రత ఎక్కువ. ఈ నీటిని గనుక ఒడిసి పట్టి గంగానదిలో కలిపితే పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల కరువు తీరుతుంది. అలాంటి ప్రాజెక్టును చైనా చేపట్టి ఏడారిని సస్యశ్యామలం చేస్తోంది. మరి మన దేశం కూడా వరద పోటెత్తే నదిని వాడుకుంటే భావి ప్రజల కన్నీటి కష్టాలు తీర్చిన వారవుతారు.