ఆ పెళ్లిలో పవన్ కు అలా జరిగిందా?

Sun Sep 24 2017 23:20:38 GMT+0530 (IST)

జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. తాజాగా ఆయన ఒక మీడియా ప్రముఖుడి ఇంటికి పెళ్లికి వెళ్లిన సందర్భంగా ఊహించని పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు.  ఏ మాత్రం ఊహించని ఈ పరిణామంతో ఆయన వెనక్కి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.
తెలుగు మీడియాప్రముఖుల్లో ఒకరు.. ఎన్ టీవీ చౌదరి కుమార్తె పెళ్లి రిసెప్షన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. నూతన దంపతుల్ని పవన్ ఆశీర్వదించే వేళలో అనూహ్య పరిణామం చోటు చేసుకోవటంతో పవన్ మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.ఎన్ టీవీ ఛైర్మన్ చౌదరి కుమార్తె  వివాహ రిసెప్షన్ వేడుక జరిగింది. వేదిక మీద ఉన్న నూతన జంటను ఆశీర్వదించేందుకు వేదిక మీదకు పవన్ కల్యాణ్ వెళుతున్న సమయంలోనే.. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. దీంతో.. పవన్ వేదిక మీదకు వెళ్లకుండా ఆగాల్సి వచ్చింది. మరి.. సీఎం వచ్చినప్పుడు హడావుడి కాస్త ఎక్కువగా ఉంటుంది.

దీంతో.. పవన్ కల్యాణ్ వెయిట్ చేయాల్సి వచ్చింది. కొద్దిసేపు వెయిట్ చేసిన పవన్.. ఏమనుకున్నారో ఏమో కానీ వెనక్కి తిరిగి వెళ్లిపోవటం.. వధూవరులను ఆశీర్వదించకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేదిక మీదకు వెళ్లకుండా .. వెనుదిరిగి వెళ్లిపోయిన పవన్ తీరుపై పలువురు తప్పు పడుతున్నారు.

ఎంత పెద్ద తార అయినప్పటికీ.. సీఎం లాంటి నేత వచ్చినప్పుడు ప్రోటోకాల్ ను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. పవన్ పెద్ద స్టార్ అనటంలో సందేహం లేదు. కానీ.. సీఎం కేసీఆర్ తో పోల్చినప్పుడు పవన్ ఇమేజ్ ను కాస్త తక్కువ చేసి చూడాల్సిందే.  అయితే.. తాను  కేసీఆర్ కారణంగా ఆగాల్సి వచ్చిందన్న విషయంపై పవన్ కల్యాణ్ అవగాహనతో నిలిచి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. ఇదే విషయం మీద మరో ఆసక్తికర వాదన విపిపిస్తోంది.

అదేమంటే.. సీఎం స్థాయి వ్యక్తులు ఒక వేడుకకు వస్తున్నారంటే.. వారి రాకకు ముందే వారు వచ్చే  సమాచారం అందుతుంది. సీఎం ఎప్పుడు వస్తారన్న విషయం మీద స్పష్టత ముందే వచ్చి ఉంటుందని.. పవన్ లాంటోళ్లు వస్తున్నామన్న విషయాన్ని ముందే తెలియజేయటం మామూలే. మరేం జరిగిందో కానీ.. కేసీఆర్ వచ్చే సమయాన్ని పవన్ కల్యాణ్ కు ముందే చెప్పి ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది. పవన్ వచ్చే విషయంపై అవగాహన ఉండి.. ఆ విషయాన్ని  ఉంటే.. ఇప్పుడు పవన్కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి ఏ మాత్రం ఎదురయ్యేది కాదని చెబుతున్నారు. మొత్తంగా పవన్ తన తీరుతో తనలోని కొత్త కోణాన్నితాజా ఉదంతంతో బయటకు తీశారని చెప్పక తప్పదు.