Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క సీఎం ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న ఎందుకు తెచ్చారు?

By:  Tupaki Desk   |   18 July 2019 8:29 AM GMT
క‌ర్ణాట‌క సీఎం ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న ఎందుకు తెచ్చారు?
X
కొద్దిరోజులుగా సాగుతున్న క‌ర్ణాట‌క సంక్షోభానికి సంబంధించి కీల‌క ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. త‌మ ప్ర‌భుత్వానికి సంబంధించి విశ్వాస తీర్మానాన్ని ఆయ‌న ప్ర‌వేశ పెట్టారు. క‌ర్ణాట‌క అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్షకు ముందు క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న ప్ర‌సంగాన్ని స్టార్ట్ చేశారు. త‌మ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి.. గ‌ద్దె దించ‌టానికి వీలుగా బీజేపీ కుట్ర చేస్తుంద‌ని ఆరోపించారు. గ‌తంలోనూ ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రిగిన విష‌యాన్ని గుర్తు చేశారు.

సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని విచ్ఛిన్నం చేయ‌టం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌కు సంబంధించి త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసే క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కూడా అధికారాన్ని లాక్కునే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌న్నారు. ఏపీ వ‌ర‌కు ఎందుకు క‌ర్ణాట‌క‌లోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయ‌న్నారు. రామ‌కృష్ణ గౌడ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని.. అప్పుడుచోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లే ఇప్పుడు కూడా చూస్తున్నామ‌న్నారు. ఇక్క‌డి స‌భ్యులు అక్క‌డికి.. అక్క‌డి స‌భ్యులు ఇక్క‌డికి వెళ్ల‌టం 1985లోనే చూశామ‌న్న ఆయ‌న‌.. అధికారం ఎవ‌రికి శాశ్వితం కాద‌ని.. తానేమీ ముఖ్య‌మంత్రి సీటుకే అతుక్కుపోయి ఉండ‌న‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఎవ‌రిని ఆమోదిస్తే వారే పాల‌కులు అవుతార‌న్నారు.

తాను సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌గ‌ల‌నా? లేదా? అన్న దానిపై తాను విధాన స‌భ‌కు రాలేద‌న్న కుమార‌స్వామి.. రాష్ట్రానికి మంచి చేసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు చెప్పారు. రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేశార‌ని.. స్పీక‌ర్ పాత్ర‌ను కూడా కొంద‌రు ప్ర‌మాదంలో ప‌డేసిన‌ట్లు చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యే త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు. బీజేపీ షురూ చేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగానే కుట్ర‌జ‌రుగుతోంద‌న్న ఆయ‌న‌.. బ‌ల‌నిరూప‌ణ అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింద‌న్న చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. సంకీర్ణ ప్ర‌భుత్వంలో తానెన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. బ‌ల‌ప‌రీక్ష వేళ ప‌లువురు జేడీఎస్ నేత‌లు.. కాంగ్రెస్ నేత‌లు స‌భ‌కు హాజ‌ర‌య్యారు. హాట్ హాట్ గా సాగుతున్న సభ‌లో కుమార‌స్వామి భావోద్వేగంతో ప్ర‌సంగించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీ‌మంత్ పాటిల్ అనూహ్యంగా ముంబ‌యి చేరుకున్నారు. అనంత‌రం ఛాతీ నొప్పి వ‌స్తుందంటూ ముంబ‌యిలోని ఒక ఆసుప‌త్రిలో చేర‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌-జేడీఎస్ కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు బ‌ల‌ప‌రీక్ష‌కు దూరంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదే వేళ‌.. మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసుప‌త్రిలో చేర‌టం చూస్తే.. కుమారస్వామి ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లిన‌ట్లుగా కనిపించ‌క మాన‌దు. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటే త‌ప్పించి.. ప్ర‌భుత్వం నిల‌బ‌డే అవ‌కాశం లేద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు.