Begin typing your search above and press return to search.

చిరంజీవి కాంగ్రెస్సా.? జనసేన.?

By:  Tupaki Desk   |   14 Oct 2018 9:51 AM GMT
చిరంజీవి కాంగ్రెస్సా.? జనసేన.?
X
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటులలో చిరంజీవి ఒకరు. ఆయన రాజకీయ ప్రవేశానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా, క్లైమాక్స్ చప్ప బడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్న ఆయన, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సైరా నరసింహరెడ్డి సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నారు. అయితే రాజకీయంగా చిరు మౌనంగా ఉండటంపై పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రజారాజ్యం స్థాపించిన తొలినాళ్లలో మంచి ఊపు ముందున్న చిరంజీవి ఆ తరువాత అంతకంతకు పార్టీ గ్రాఫ్ తగ్గుతూ పోవడంతో ఫేమ్ కోల్పోయారు. సినిమాల్లో అశేష అభిమానాలను సంపాదించుకున్నారు. వారి అండదండలతో ఖచ్చితంగా సీఎం పీఠం ఎక్కవచ్చని అనుకున్నారు. రాజకీయాలు చేయడం అంత ఆషామాషీ కాదనే విషయం ఆయనకు మెల్లమెల్లగా బోధపడింది. అనుకునున్నట్టే ఎన్నికల్లో పోటీ చేసి 17 మంది వరకు ఎమ్మెల్యేలను గెలిపించగలిగారు.

తదనంతర పరిమాణాల నేపథ్యంలో ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకున్నారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన స్థాపించి ఏపీ మొత్తం తిరుగుతున్నారు.

కాగా, తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో టీఆర్ఎస్ కు దీటుగా దూసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తుంది. ఓటర్లను ప్రసన్నం ఆకట్టుకోవడానికి అవసరమైన అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలో పార్టీలో ఉన్న సినిమా నటులతో కాంపెయిన్ చేయిస్తే కొంత ఉత్సాహం దొరుకుతుందని భావించారు. ఆ మేరకు ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న విజయశాంతిని దారికి తెచ్చారు. అదే ఊపులో చిరంజీవిని ప్రచారానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారట..

ఇంత వరకు బాగానే ఉన్నా, అసలు చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారా అన్న చర్చ మొదలైంది. ఒక వైపు నాగబాబు జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బాటలోనే చిరంజీవి కూడా పయనిస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ ను వీడతారనే చర్చ కూడా జరుగుతోంది. జనసేనాని పవన్ సమక్షంలో పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కూడా తాను చిరంజీవి ఆశీర్వాదంతోనే జనసేనలో చేరానని చెప్పడం కొసమెరుపు. ఈ లెక్కన చిరంజీవి తన తమ్ముడి పార్టీ జనసేనకు మద్దితిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కానీ దీనిపై ఎక్కడా నోరు విప్పడం లేదు. మరి చిరు మౌనం వెనుక ఏం దాగుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.