సింగిల్ ఓటర్ అయిన శివాజీకి బాబు ఎందుకంత ప్రిఫరెన్స్?

Tue Feb 12 2019 20:00:01 GMT+0530 (IST)

నటుడు శివాజీ పరిస్థితి ఏమిటో తెలుగు వాళ్లకు చెప్పనక్కర్లేదు. సినిమాల్లో మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసుకునే వాడు. ఆ తర్వాత వాటితో వచ్చిన గుర్తింపుతో కొంచెం ప్రాధాన్యత  ఉన్న పాత్రలు లభించాయి. హీరోగా కొన్ని చిన్న  సినిమాల్లో నటించాడు. అవి కూడా అంతంతమాత్రంగా ఆడటంతో ఇతడి కెరీర్ కు తెరపడింది. దాదాపు ఆరేడేళ్ల కిందటే ఇతడి సినిమా కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యింది.ఆ తర్వాత ఒక మీడియాధినేతతో ఉన్న సత్సంబంధాలతో శివాజీ రాజకీయ పరమైన గుర్తింపు కోసం ప్రయత్నాలు చేశాడు. మొదట్లో కొన్ని అంశాల గురించి ఇతడి వాయిస్ ను ఆ మీడియా సంస్థ వినిపించింది. ఆపై ఇతడు బీజేపీలో చేరినట్టుగా ప్రకటించుకున్నాడు కూడా. కొంతకాలం పాటు మోడీ భజన చేశాడు. అయితే ఆ తర్వాత ఇతడిని తెలుగుదేశం పార్టీ టేకోవర్ చేసింది.
మొదట్లో మోడీని తిట్టించడానికి ఇతడిని బాగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబు ఇలాంటి తటస్థ ముసుగులో తన వాళ్లను పెట్టుకొంటూ ఉంటాడు. ఆ తరహాలోనే శివాజీ కూడా అని అప్పుడే అర్థం అయ్యింది.  ఆ తర్వాత జగన్ ను కూడా ఇతడి చేత విమర్శించడం మొదలుపెట్టించారు.

ఇక ఆపరేషన్ గరుడ కథ తెలిసిన సంగతే. తనకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది అంటూ శివాజీ ఏదో చెప్పాడు. మొదట్లో దాన్ని సీరియస్ గా తీసుకోలేదు ఎవరూ. అయితే జగన్ పై హత్యాయత్నం తర్వాత.. శివాజీ మీద అందరికళ్లూ పడ్డాయి. ఆపరేషన్ గరుడ కథ ఏమిటి అది ఈ నటుడికి ఎలా తెలిసింది? అనే అంశం గురించి అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే ఆ విషయాలు తనకు ఎలా తెలిశాయో ఇతడు చెప్పడం లేదు.

ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం ఇతడికి చాలా ప్రాధాన్యతనే ఇస్తోంది. ప్రత్యేకహోదా కోసం దీక్ష అంటూ చంద్రబాబు నాయుడు చేపట్టిన డ్రామాకు కూడా శివాజీని తీసుకెళ్లారు. శివాజీ కి నటుడిగా భారీ ఇమేజీ లేదు. ఇతడు చెబితే పడే ఓట్లు ఏమీ లేవు.ఇలాంటి నేపథ్యంలో ఇతడిని సింగిల్ ఓటర్ శివాజీగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో. మరి ఈ సింగిల్ ఓటర్ శివాజీకి చంద్రబాబు నాయుడు ఎందుకు అంత ప్రాధాన్యతను ఇస్తున్నాడు. ఇతడు బాబుకు  ఏరకంగా ఉపయోగపడుతూ ఉన్నాడు? ఆపరేషన్ గరుడ ఇతడికే ఎలా తెలిసింది? ఇతడు వివాదాస్పదుడు అయ్యాకా కూడా చంద్రబాబు నాయడు ఈయనను ఎందుకు తమ గ్యాంగ్ లో మెంబర్ గా కొనసాగిస్తూ ఉన్నాడు.. అనేవి శేషప్రశ్నలు!