Begin typing your search above and press return to search.

లోకేష్‌కు చంద్ర‌బాబు క్లాస్ వెన‌క రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:15 AM GMT
లోకేష్‌కు చంద్ర‌బాబు క్లాస్ వెన‌క రీజ‌న్ ఇదే
X
ప్ర‌భుత్వ పాల‌న విష‌యంలోను, ఇటు పార్టీ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఉండే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈ రెండు విష‌యాల్లో అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని ప‌దేప‌దే చెబుతుంటారు. ప్ర‌భుత్వంలోని మంత్రులు, పార్టీలోని నేత‌లు ఎవ‌రైనా చంద్ర‌బాబు విధానాల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల్సిందే. ఈ విష‌యంలో బాబుకు ఎలాంటి మొహ‌మాటం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కొడ‌క‌ని కూడా చూడ‌కుండా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి ఈమ‌ధ్య క్లాస్ తీసుకున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. ప్ర‌స్తుతం టీడీపీ జాతీయ అధ్య‌క్ష హోదాలో ఉన్న చంద్ర‌బాబు అటు ప్ర‌భుత్వ‌, ఇటు పార్టీ కార్య‌క్ర‌మాల‌తో విప‌రీత‌మైన బిజీగా ఉంటున్నారు.

మ‌రోప‌క్క‌, ప్ర‌పంచ‌స్థాయిలో ఏపీ రాజ‌ధానిని నిర్మించాల‌నే క్ర‌తువును ఆయ‌న భుజాల‌పై వేసుకున్నారు. మ‌రోప‌క్క‌, వివిధ శాఖల స‌మీక్ష‌లు, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ కోసం విదేశీ ప్ర‌యాణాలు, ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల అమ‌లుపై కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు. వివిధ ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాలు. ఇలా క్ష‌ణం తీరిక‌లేకుండా చంద్ర‌బాబు షెడ్యూల్ న‌డుస్తోంది. మ‌రోప‌క్క త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీని బ‌లోపేతం చేయ‌డం, కిందిస్థాయి నేత‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించ‌డం, వారిని సంతృప్తి ప‌ర‌చ‌డం అనేవి చంద్ర‌బాబుకు క‌త్తిమీద సాములా మారాయి.

ముఖ్యంగా టీడీపీ కిందిస్థాయి నేత‌ల‌కు అస్స‌లు స‌మ‌యాన్ని కేటాయించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్‌తో ఇటీవ‌ల మాట్లాడిన సంద‌ర్భంగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. నువ్వు పార్టీ కోసం వారంలో మూడు రోజులు కేటాయించినా ప‌రిస్థితి న‌డిచింది.... ఇక‌పై మాత్రం ఇలా జ‌ర‌గ‌డానికి వీల్లేదు. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని పూర్తి స‌మ‌యాన్ని అంటే వారంలో ఏడు రోజులూ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని, క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు, పార్టీ ప‌టిష్టంగా ఉండేందుకు కృషి చేయాల‌ని చెప్పార‌ట చంద్ర‌బాబు.

వాస్త‌వానికి గ‌డిచిన ఏడాది కాలంగా లోకేష్ వారంలో మూడు రోజుల పాటు గుంటూరులోనే ఉంటూ పార్టీ కార్య్ర‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. మిగిలిన రోజుల్లో హైద‌రాబాద్‌లో ఉంటున్నా.. అక్క‌డ కూడా తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. కానీ, ఏపీలో రాబోయే మునిసిపల్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఆ నాలుగు రోజులు కూడా ఏపీలోనే ఉండాల‌ని కోరార‌ట చంద్ర‌బాబు. అయితే, ఈ విష‌యంలో త‌న‌కున్న ఇబ్బందుల‌ను కూడా లోకేష్ ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి కి వివ‌రించార‌ని తెలిసింది. త‌మ ముద్దుల కొడుకు దేవాన్ష్‌ను చూసుకునేందుకు, కుటుంబంతో గ‌డిపేందుకు ఆ మాత్రం స‌మ‌యం ఉండాల‌ని లోకేష్ అన్నార‌ట‌.

అదేస‌మ‌యంలో గ‌త కొన్నాళ్లుగా తాను స్పాండిలైటిస్తో బాధ‌ప‌డుతున్న విష‌యాన్ని కూడా వివ‌రించార‌ట‌. ఇక‌, ఇప్ప‌టికే వారంలో మూడు రోజులు పూర్తిగా గుంటూరులోనే ఉంటున్నాక‌దా అన్నార‌ట‌. అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు .. లోకేష్‌ను అనున‌యించార‌ని తెలుస్తోంది. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించాలంటే ఆ మాత్రం కొన్ని త్యాగాలు చేయ‌క‌త‌ప్ప‌ద‌ని, పూర్తిగా వారం రోజులూ పార్టీకే స‌మ‌యం కేటాయించాల‌ని క్లాస్ తీసుకున్నార‌ట‌. సో.. దీంతో ఇక‌, ఏమీ మాట్లాడ‌కుండా త‌న తండ్రి ఆదేశాను సారం న‌డిచేందుకు లోకేష్ రెడీ అయిపోరార‌ట‌. ఈ క్ర‌మంలో మ‌కాంను కూడా హైద‌రాబాద్ నుంచి గుంటూరు లేదా విజ‌య‌వాడ‌కు మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది