Begin typing your search above and press return to search.

ఉత్తమ్ - భట్టి.. సీఎం పోటీలో నిలిచేదెవరు?

By:  Tupaki Desk   |   6 Dec 2018 7:53 AM GMT
ఉత్తమ్ - భట్టి.. సీఎం పోటీలో నిలిచేదెవరు?
X
తెలంగాణ ఎన్నికలకు వేళయ్యింది. మరికొన్ని గంటల్లో ఓటర్ల నాడి ఈవీఎంలలో నిక్షిప్తమవ్వబోతోంది. టీఆర్ఎస్ తో నువ్వానేనా అన్నట్టు మహాకూటమి ఫైటింగ్ జరుగుతోంది. మరి ఒక వేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది. పీసీసీ చీఫ్ గా తెలంగాణ కాంగ్రెస్ ను, కూటమిని ముందుండి నడిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పదవి దక్కబోతోందా.? దళితుడిని సీఎం చేస్తానని అప్పట్లో చెప్పిన రాహుల్ మాట పనిచేసి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం అవుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని.. ఆ తర్వాత మాట మార్చి తనే ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల రాహుల్ గాంధీ అందరికీ ఆమోదయోగ్యమైన తెలంగాణ నేతే సీఎం అవుతారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెడ్డి, దళిత కార్డులు ఇప్పుడు తెలంగాణ పొలిటిక్స్ లో బలంగా ఉన్నాయి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ రెడ్డిలనే సీఎం చేస్తుండడంతో ఈసారి ఆ అపవాదును తొలగించుకోవాలనే డిమాండ్ పార్టీలో ఎక్కువవుతోందట.. దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతల నుంచి డిమాండ్ వస్తోందట.. ఒక వేళ దళితులకు సీఎం పదవి ఇస్తే.. సౌమ్యుడు - రాజకీయ చతురుడు - రైతులను ఆదుకున్న వ్యక్తిగా, మంచి చేసిన , అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా పేరొందిన మల్లు భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉంటాడని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండే ఆప్షన్లున్నాయి.. అయితే రెడ్డిలకు, లేదంటే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి ముందుండి నడిపిస్తున్నాడు. రాహుల్ , చంద్రబాబు వెంట ఉండి పార్టీని ఎన్నికల కార్యక్షేత్రంలో దించారు. ఇక భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అండదండలున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ మాత్రం ఉత్తమ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

అయితే తెలంగాణలో తరతరాలుగా రావులు, రెడ్డిల రాజ్యం పెరిగిపోయిందని విమర్శలు పెరిగిపోయాయి. బీసీలు, దళితులను సీఎం చేయాలని అణగారిన వర్గాల నుంచి డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కనుక దళిత కార్డును ప్రయోగిస్తే భట్టికే మొదటి చాన్స్ ఉండే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో ఎంతో మంచి పేరు.. అందరినీ సమానంగా చూసే మనస్తత్వం, పేద, ధనిక లేకుండా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా.. మంచి వాగ్ధాటి కలిగిన నేత పేరున్న మల్లు భట్టి సీఎం కావడానికి తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్లందరూ అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.